Hema: మరో వీడియో పోస్ట్‌ చేసిన నటి హేమ

నటి హేమ సోషల్‌ మీడియాలో కొత్త వీడియో షేర్‌ చేశారు.

Published : 21 May 2024 20:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బెంగళూరు శివారు ప్రాంతంలోని ఓ ఫామ్‌ హౌజ్‌లో నిర్వహించిన రేవ్‌ పార్టీ (Bengaluru Rave Party) చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తెలుగు నటులు పలువురు అందులో పాల్గొన్నట్టు వచ్చిన రూమర్స్‌ దుమారం రేపాయి. అక్కడికి తాను వెళ్లినట్టు ప్రచారం జరగ్గా దాన్ని ఖండిస్తూ నటి హేమ (Hema) సోమవారం వీడియో విడుదల చేశారు. ఆ రేవ్‌ పార్టీతో తనకెలాంటి సంబంధం లేదని తెలిపారు. ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ (Srikanth), కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ (Jani Master)ల పేర్లూ తెరపైకి రాగా.. తమకు అలాంటి అలవాట్లు లేవన్నారు. తమపై వచ్చిన వదంతులను ఖండించారు. దీంతో, వారి సోషల్‌మీడియా ఖాతాలపై నెటిజన్ల దృష్టి పడింది. వారేం పోస్ట్‌ చేస్తున్నారా? తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే హేమ తాను చేసిన ధమ్‌ బిర్యానీకి సంబంధించిన వీడియో పోస్ట్‌ చేశారు. దాన్ని ఎలా వండాలో అందులో పేర్కొన్నారు.

రేవ్‌ పార్టీలో ఆ తెలుగు నటి పాల్గొన్నారు: బెంగళూరు కమిషనర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని