Hema: బెంగళూరు రేవ్‌పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ

బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటిహేమ స్పష్టం చేశారు.

Published : 20 May 2024 11:20 IST

హైదరాబాద్‌: బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్‌ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీనటి హేమ (Hema) స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆమె ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ‘నేను ఎక్కడకు వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఇక్కడ ఫామ్‌హౌస్‌లో ఎంజాయ్‌ చేస్తున్నాను. నాపై వస్తోన్న వార్తలను నమ్మకండి. అవి ఫేక్‌ న్యూస్‌. అక్కడ ఎవరు ఉన్నారో నాకు తెలియదు. దయచేసి మీడియాలో నాపై వచ్చే వార్తలను నమ్మకండి’ అని విజ్ఞప్తి చేశారు.

బెంగళూరులో 100 మందితో రేవ్‌పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!

బెంగుళూరు శివారులో ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్‌ హౌస్‌లో నిర్వహించిన రేవ్‌ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడ్డారు. దాదాపు 100 మందికి పైగా పార్టీకి హాజరయ్యారు. పార్టీలో పలు రకాల డ్రగ్స్‌ వాడినట్లు పోలీసులు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని