Top Searched Movies in 2023: ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సినిమాలివే!

2023 మరో 20 రోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో గూగుల్‌లో ఎక్కువమంది శోధించిన చిత్రాలు, ఓటీటీ కంటెంట్‌ ఇదే!

Updated : 11 Dec 2023 18:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మరో 20 రోజుల్లో 2024 ప్రారంభం కాబోతోంది. ఈ ఏడాది బాక్సాఫీస్‌ వద్ద అనేక చిత్రాలు సందడి చేశాయి. బాలీవుడ్‌కు ఈ ఏడాది విశేషమైన వసూళ్లు లభించాయి. ముఖ్యంగా షారుఖ్‌ఖాన్‌ రెండు బ్లాక్‌బస్టర్లు ఇచ్చారు. ఈ క్రమంలో గూగుల్‌లో అత్యధికమంది శోధించిన టాప్‌ మూవీ ఏంటో తెలుసా? షారుఖ్‌ఖాన్‌ ‘జవాన్‌’ (Jawan). 2023లో అత్యధిక మంది నెటిజన్లు ‘జవాన్‌’ మూవీ, దాని విశేషాల కోసం వెతికారట. ‘ఇండియాస్‌ ఇయర్‌ ఇన్‌ సెర్చ్‌ 2023’తో పేరుతో విడుదల చేసిన టాప్‌ సెర్చ్‌ మూవీస్‌లో ‘జవాన్‌’ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉండగా, ఆ తర్వాత ‘గదర్‌2’ ఉంది. మూడో స్థానంలో ఒప్పొన్‌హైమర్‌ చోటు దక్కించుకుంది. ఇక అత్యధిక మంది శోధించిన నటుల జాబితాలో జెర్మీ రెన్నర్‌ ఉన్నారు. ఇండియా నుంచి కేవలం కియారా అడ్వాణీ మాత్రమే టాప్‌-10 జాబితాలో చోటు సంపాదించుకున్నారు.

  • ఇండియాలో అత్యధికమంది శోధించిన చిత్రాలు
  • జవాన్‌
  • గదర్‌2
  • ఒప్పొన్‌హైమర్‌
  • ఆదిపురుష్‌
  • పఠాన్‌
  • ది కేరళ స్టోరీ
  • జైలర్‌
  • లియో
  • టైగర్‌-3
  • వారిసు
  • ఆన్‌లైన్‌ వేదికగా అత్యధిక మంది శోధించిన నటులు
  • జెర్మీ రెన్నర్‌
  • జెన్నా ఒర్టెగా
  • ఇచికావా ఎన్నోసుకే ఐవీ
  • డాన్నీ మాస్టర్‌సన్‌
  • పెడ్రో పాస్కల్‌
  • జామీ ఫాక్స్‌
  • బ్రెండన్‌ ఫ్రాసర్‌
  • రస్సెల్‌ బ్రాండ్‌
  • కియారా అడ్వాణీ
  • మాట్‌ రైఫీ
  • ప్రపంచవ్యాప్తంగా అత్యధికమంది శోధించిన చిత్రాలివే!
  • బార్బీ
  • ఒప్పొన్‌హైమర్‌
  • జవాన్‌
  • సౌండ్‌ ఆఫ్ ఫ్రీడమ్‌
  • జాన్‌ విక్‌: చాప్టర్‌4
  • అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌
  • ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌
  • గదర్‌2
  • క్రీడ్‌ 3
  • పఠాన్‌
  • అత్యధికమంది శోధించిన ఓటీటీ కంటెంట్‌
  • ఫర్జీ
  • వెన్స్‌డే
  • అసుర్
  • రానానాయుడు
  • ది లాస్ట్‌ ఆఫ్ అజ్‌
  • స్కామ్‌ 2003
  • బిగ్‌బాస్‌ 17
  • గన్స్‌ అండ్‌ గులాబ్స్‌
  • సెక్స్‌/లైఫ్‌
  • తాజా ఖబర్‌
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని