Tollywood: అదిరే అదిరే.. పోనీటేల్ అదిరే!
సినిమా సినిమాకి వైవిధ్యం చూపించాలంటే కేవలం హీరో క్యారెక్టరైజేషన్ ఉండే సరిపోదు.. ట్రెండ్‌కి తగ్గట్టు లుక్స్ కూడా మార్చాల్సి ఉంటుంది. థియేటర్ నుంచి బయటికి అడుగుపెట్టగానే పాటలు, ఫైట్స్ గురించి ఎంత చర్చించుకుంటారో.. హీరో హెయిర్‌స్టైల్ కనుక ఫ్యాన్స్‌కి నచ్చినట్లైతే అంతే అంతే టాక్ వస్తుంది.
అందరి చూపు దోచిన పోనీటేల్ హెయిర్‌స్టైల్‌లో అలరించిన హీరోలు ఎవరెవరంటే..
సినిమా సినిమాకీ వైవిధ్యం చూపించాలంటే కేవలం హీరో క్యారెక్టరైజేషన్ ఉంటే సరిపోదు.. ట్రెండ్‌కి తగ్గట్టు లుక్స్ కూడా మార్చాల్సి ఉంటుంది. థియేటర్ నుంచి బయటికి అడుగుపెట్టగానే పాటలు, ఫైట్స్ గురించి ఎంత చర్చించుకుంటారో.. హీరో హెయిర్‌స్టైల్ ఫ్యాన్స్‌కి నచ్చితే అంతే టాక్ నడుస్తుంది. అది యువత మనసు ఆకట్టుకుంటే అదే ట్రెండ్ అయిపోతుంది. తాజాగా రామ్‌చరణ్-శంకర్ చిత్రం ‘ఆర్‌సీ’ 15 ప్రారంభంలో అందరినీ ఆకర్షించిన దృశ్యం.. రణ్‌వీర్ సింగ్ ‘పోనీటేల్’ హెయిర్ స్టైల్. ఈ పిలకల జుట్టుతో ప్రత్యేకంగా అందరి చూపుని తనవైపునకు తిప్పుకున్నారు రణ్‌వీర్. సినీ పరిశ్రమలో ఈ ట్రెండ్ కొత్త కాకపోయినప్పటికీ ఎవరైనా పిలకల్లో కనిపిస్తే మాత్రం కళ్లు అటువైపు తిప్పాల్సిందే. మరి మన టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో ఆ హెయిర్‌స్టైల్‌లో మెరిసిన హీరోల పోనీటేల్ పై ఓ లుక్కెద్దాం పదండి!
రణ్‌వీర్ సింగ్
తమిళ్‌లో ‘అనియన్’గా, తెలుగులో ‘అపరిచితుడు’గా విక్రమ్-శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని హిందీలో రణ్‌వీర్‌తో చేయనున్నారు దర్శకుడు శంకర్. ప్రత్యేకించి అపరిచిత్ సినిమా కోసమే రణ్‌వీర్ ఇలా క్రాఫ్ పెంచారు. జుట్టు కాస్త వదిలేయకుండా రెండు పిలకలతో కనిపించారు. అయితే ఈ స్టైల్‌ని ఆన్‌స్ర్కీన్‌కి మాత్రమే పరిమితం చేయలేదు రణ్‌వీర్. ఆఫ్‌స్ర్కీన్‌లో ఫొటోషూట్స్ కోసం ఒక్కోసారి ఇలా మెరుస్తుంటారు. అందుకే మరి ఆయన్ను స్టైల్‌కా బాప్ అని పిలుచుకుంటారు.
ఉపేంద్ర
సినిమా సినిమాకీ హెయిర్ స్టైల్‌లో వైవిధ్యం చూపిస్తుంటారు కన్నడ హీరో ఉపేంద్ర. రణ్‌వీర్‌ని ‘ఆర్15’ ప్రారంభోత్సవంలో చూడగానే మొదట అందరికీ గుర్తుకు వచ్చిన వ్యక్తి ఉప్పినే. నేను ట్రెండ్‌ను ఫాలో అవను సెట్ చేస్తా అంటూ తన పోనీటేల్ గురించి చర్చించుకునేలా చేశాడీ నటుడు. ఆయన హీరోగా కన్నడంలో వచ్చిన ఉప్పి-2లో మూడు పిలకలతో అలరించారు.
రామ్‌చరణ్
రామ్‌చరణ్ కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రం ‘మగధీర’. అందులో బంగారు కోడిపెట్ట పాటలో పోనీటేల్‌లో స్టెపులేస్తూ అదరగొట్టారు. ఇక తండ్రి చిరుతో పాటు చిందేసిన ఆ పాటకి యమా క్రేజ్ వచ్చింది. అంతేకాదు దర్శకుడు కృష్ణవంశీ సైతం చెర్రీని పోనీటేల్‌లో చూపించారు. ఆయన దర్శకత్వంలో 2014లో వచ్చిన ‘‘గోవిందుడు అందరివాడేలే’’లోనూ సినిమా మొత్తం ఇదే స్టైల్‌లో కనిపించారు.
విజయ్ దేవరకొండ
‘లైగర్’ కోసం జుట్టుని బాగా పెంచారు నటుడు విజయ్‌దేవరకొండ. కుటుంబ సభ్యులతో గడిపిన చిత్రాలను గతంలో ఇన్‌స్టా వేదికగా పంచుకోగా అందులో పోనీటేల్‌లో కనిపించారు. తన ఫ్యాషన్ డ్రెస్ బ్రాండ్ ‘రౌడీ’ ప్రమోషన్స్‌తో పాటు విజయ్ అమ్మ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన వీడియోలోనూ పిలకతో కనిపించారు.
‘యమ దొంగ’లో ఎన్టీఆర్
దర్శకధీరుడు రాజమౌళి- ఎన్టీఆర్ కాంబోలో 2007లో వచ్చిన ఫాంటసీ యాక్షన్ కామెడీ చిత్రం ‘యమదొంగ’. ఇందులో ‘నాచోరే నాచోరే’లో తారక్ వేసిన స్టెప్స్‌కి ఎంత క్రేజ్ వచ్చిందో అందులో ఆయన పోనీటేల్ సైతం ఆ పాటకి హైలైట్‌గా నిలిచింది. జుట్టుపై ప్రయోగాలు చేయని తారక్ ఇదే చిత్రంతో పోనీతో ప్రారంభించి ట్రెండ్‌సెట్ చేశారు.
అల్లుఅర్జున్
స్టైల్‌ని అమితంగా ఇష్టపడే నటుల్లో నటుడు అల్లు అర్జున్ ఒకరు. అందుకే ఆయన్ని అభిమానులు ‘స్టైలిష్‌స్టార్’ అని పిలుస్తారు. తొలిచిత్రం నుంచి ఒక్కోహెయిర్‌స్టైల్‌లో అలరిస్తున్నాడు బన్నీ. 2011లో వచ్చిన ‘బద్రినాథ్’లో పోనీటేల్‌లో కనిపించాడు.
నితిన్
నితిన్ సైతం ఈ ట్రెండ్‌ని అందిపుచ్చుకున్నారు. పూరి జగన్నాథ్- నితిన్ కలయికలో వచ్చిన చిత్రం హార్ట్‌ఎటాక్. ఇందులో పోనీటేల్‌లో కనిపించాడు నితిన్.
ప్రభాస్
‘బాహుబలి’ చిత్రం కోసం జుట్టు పెంచారు ప్రభాస్. సినిమాలో ఎక్కడా పిలకతో కనిపించకపోయినప్పటికీ ఈ సినిమా షూటింగ్ అప్పుడు బయటంతా పోనీలోనే కనిపించారు డార్లింగ్.
హృతిక్‌రోషన్
డ్యాన్స్ చేసేటప్పుడు బాడీని స్ప్రింగ్‌లా తిప్పేసే హృతిక్‌రోషన్ ‘రాడో’ వాచ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. రాడో ఈవెంట్‌తో పాటు 2009లో ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లోనూ ఇదే హెయిర్‌స్టైల్‌లో మెరిశారు.
అమితాబ్ బచ్చన్
2007లో ఆర్.బల్కీ దర్శకత్వంలో అమితాబ్ నటించిన చిత్రం ‘చీనీ కమ్’. ఇందులో చెఫ్ పాత్రలో కనిపించారు అమితాబ్. రొమాంటిక్ కామెడీ జానర్‌లో వచ్చిన ఇందులో టబు పక్కన పోనీటేల్‌లో కనిపించారు.
సల్మాన్‌ఖాన్
సల్మాన్‌ఖాన్ తాను కూడా ఏం తక్కువ కాదని నిరూపించుకున్నాడు. సినిమాల్లో కాకపోయినా ఆయన హోస్ట్‌గా చేసిన ‘దస్‌కా దమ్’ అనే ప్రఖ్యాత ఇంటర్నేషనల్ రియాల్టీ గేమ్‌షోలో ఇలా కనిపించారీ కండలవీరుడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
వయనాడ్ సీటు ఖాళీ.. ప్రకటించిన లోక్‌సభ సచివాలయం
-
Politics News
‘షాపూర్జీ పల్లోంజీ నుంచి.. రూ.143 కోట్లు వసూలు చేసిన చంద్రబాబు’
-
Ts-top-news News
తిరుపతి-సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్.. 8న ప్రారంభించే అవకాశం
-
Sports News
కోహ్లి దంపతుల ‘సేవ’.. కొత్త ఎన్జీవోకు శ్రీకారం
-
Movies News
Dasara: ‘దసరా’ సెన్సార్ రిపోర్టు.. మొత్తం ఎన్ని కట్స్ అంటే?
-
Sports News
Rishabh Pant: రిషభ్ పంత్‌కు అరుదైన గౌరవం ఇవ్వనున్న దిల్లీ క్యాపిటల్స్!