Hi Nanna: రానున్న డిసెంబర్‌ ఫాదర్స్‌ మంత్‌.. ఎందుకంటే: నాని

నాని నటించిన తాజా చిత్రం ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna). ఈ సినిమా ప్రచారంలో భాగంగా నాని చెన్నైలో విలేకర్లతో ముచ్చటించారు.

Published : 25 Nov 2023 18:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాని (Nani) హీరోగా శౌర్యువ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna). మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) కథానాయిక నటించగా.. శ్రుతి హాసన్‌ (Shruti Haasan), బేబీ కియారా కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్‌ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో నాని ప్రచారంజోరు పెంచారు. తాజాగా చెన్నైలో విలేకర్లతో మాట్లాడారు. తనకు తమిళ చిత్రపరిశ్రమ అంటే అభిమానమన్నారు. చెన్నైలోకూడా చాలా మంది స్నేహితులున్నట్లు తెలిపారు. 

ఇక ‘హాయ్‌ నాన్న’ గురించి మాట్లాడుతూ..‘ఈ సినిమా షూటింగ్ మొత్తం హాలిడే లాగ అనిపించింది. చాలా లోకేషన్లలో చిత్రీకరణ చేశాం. సినిమా కచ్చితంగా అందరి హృదయాలకు హత్తుకుంటుంది. అమ్మ సెంటిమెంట్‌తో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చి సూపర్ హిట్‌ అయ్యాయి. ఇప్పుడు నాన్న సెంటిమెంట్‌తో చిత్రాలు వరుసగా రానున్నాయి. డిసెంబర్ 1న ‘యానిమల్’ విడుదల కానుంది. అది తండ్రీ కొడుకుల కథ. ఆ తర్వాత ‘హాయ్‌ నాన్న’ వస్తుంది ఇది తండ్రీ కుమార్తెల మధ్య అనుబంధం ప్రధానంగా సాగుతుంది. అలాగే ఇదే కాన్సెప్ట్‌తో మరికొన్ని చిత్రాలు కూడా అలరించడానికి సిద్ధమవుతున్నాయి. రానున్న డిసెంబర్‌ ఫాదర్స్‌ మంత్‌లా ఉంది. ఇక ఈ సినిమా డబ్బింగ్‌ కూడా చాలా క్వాలిటీగా వచ్చింది. గతంలో కొన్ని సినిమాల్లో నాన్నగా నటించాను. కానీ, ఈ చిత్రం మాత్రం ప్రత్యేకమైనది. ఇదేం సందేశాత్మక చిత్రం కాదు. థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులు మంచి ఫీల్‌తో బయటకు వస్తారు.

నో స్వీట్స్‌.. నాలుగు నెలల కఠోర సాధన..: ‘యానిమల్‌’ విలన్‌ లుక్‌ ఇలా సాధ్యమైంది

ఇక హీరోయిన్‌గా మృణాల్‌ను మా టీమ్ అంతా కలిసి ఎంపిక చేసింది. ఆమె చాలా అద్భుతంగా నటించింది. తండ్రీ కూతుళ్ల మధ్య అనుబంధం అనేది యూనివర్సల్ సబ్జెక్ట్‌. అందుకే పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నాం. మనందరి జీవితంలో ప్రతి దశలోనూ మహిళలు తోడుంటారు. అమ్మ, అక్క, భార్య, కూతురుగా ఇలా ప్రతి దశలో వాళ్లు తోడుగా ఉండి నడిపిస్తారు. అందుకే నా సినిమాల్లో హీరోయిన్‌ పాత్రకు ప్రాధాన్యం ఉండేలా చూస్తా. తమిళంలోనూ కథలు వింటున్నా. త్వరలోనే తమిళ సినిమా గురించి ప్రకటిస్తా’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని