Bobby Deol: నో స్వీట్స్‌.. నాలుగు నెలల కఠోర సాధన..: ‘యానిమల్‌’ విలన్‌ లుక్‌ ఇలా సాధ్యమైంది

‘యానిమల్‌’ (Animal) లో బాబీ దేవోల్‌ లుక్‌ గురించి ఆయన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 26 Nov 2023 02:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor) హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తోన్న చిత్రం ‘యానిమల్‌’ (Animal). యాక్షన్‌ థ్రిల్లర్‌గా సిద్ధమవుతోన్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్‌ (Bobby Deol).  ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో బాబీ నటన ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా ఆయన ఫిజిక్‌ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాబీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ప్రజ్వల్‌ శెట్టి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నటుడు ఫిట్‌నెస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘దాదాపు ఆరేళ్ల నుంచి బాబీకి ట్రైనర్‌గా పనిచేస్తున్నా. ‘యానిమల్‌’లో ప్రతినాయకుడి పాత్ర కోసం ఆయన్ని ఎంచుకున్నప్పుడు లుక్‌ విషయంలో చిత్ర దర్శకుడు సందీప్‌ వంగా కొన్ని సూచనలు చేశారు. రణ్‌బీర్‌ కపూర్‌ కంటే భారీగా బాబీ కనిపించాలని చెప్పారు. అందుకు నాలుగు నెలలు టైమ్‌ ఇచ్చారు. స్వీట్స్‌ తినకుండా కచ్చితమైన డైట్‌ ఫాలో అవుతూ ఆయన కఠోర సాధన చేశాడు. ట్రైనింగ్ అనంతరం బాబీ లుక్‌ చూసి టీమ్‌ ఎంతో ఆనందించింది. ముఖ్యంగా క్లైమాక్స్‌ షూట్‌ రోజు బాబీ నన్ను సెట్‌కు ఆహ్వానించి మెచ్చుకున్నారు’’ అని ప్రజ్వల్‌ తెలిపారు.

తండ్రీతనయుల సెంటిమెంట్‌తో ‘యానిమల్‌’ సిద్ధమవుతోంది. ఒక వ్యక్తి తన కుటుంబం కోసం ఎంత దూరం వెళ్తాడు..? అనే అంశాన్ని ఈసినిమాలో చూపించారు. అనిల్‌ కపూర్‌, రణ్‌బీర్‌ కపూర్‌ తండ్రీ తనయుల పాత్రల్లో నటించారు. రష్మిక కథానాయిక. డిసెంబర్‌ 1న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని