Nikhil: ఇలాంటి సినిమాలు ఎక్కువగా రావాల్సిన అవసరం ఉంది: నిఖిల్‌

హీరో నిఖిల్ (Nikhil) తాజాగా ఓ సినిమాను ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు. అలాంటి సినిమాలు ఎక్కువగా రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Published : 23 Jul 2023 15:53 IST

హైదరాబాద్‌: చిన్న హీరోగా కెరీర్‌ మొదలుపెట్టి స్టార్‌గా ఎదిగాడు నిఖిల్‌ (Nikhil). ఎప్పుడూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటూ అప్‌డేట్‌లు పంచుకుంటూ ఉంటాడు. తాజాగా ఈ హీరో ‘రోజా’ సినిమాను (Roja) ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశాడు. 1992లో విడుదలైన రోజా సినిమా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ మూవీ మ్యూజికల్‌గా హిట్‌ అవ్వడమే కాకుండా సందేశాత్మక చిత్రంగా ఎన్నో అవార్డులను అందుకుంది. తాజాగా ఈ సినిమాను నిఖిల్ గుర్తుచేసుకున్నాడు.

సెక్రటరీతో రేఖ రిలేషన్‌ అంటూ ప్రచారం.. ఖండించిన రైటర్‌

‘రోజా’ పోస్టర్‌ షేర్‌ చేసిన నిఖిల్‌.. ‘‘ఇలాంటి సినిమాలు ఎక్కువగా రావాల్సిన అవసరం ఉంది. ఇవి ఐకమత్యం గొప్పతనాన్ని తెలియజేసేలా ఉంటాయి. ఏ విషయంలోనైనా అవతలి వారి దృష్టికోణంలో కూడా ఆలోచించాలని తెలియజేస్తాయి’’ అని రాశారు. అయితే నిఖిల్ ‘రోజా’ సినిమాను ఇప్పుడు ఎందుకు ప్రస్తావించారో చెప్పలేదు. ఇక గతేడాది ‘కార్తికేయ2’, ‘18 పేజస్‌’ రెండు చిత్రాలతో సూపర్‌ హిట్ అందుకున్నాడు నిఖిల్‌.. ఇటీవల ‘స్పై’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘స్పై’ మిశ్రమ స్పందనలకే పరిమితమైంది.  ప్రస్తుతం ‘స్వయంభూ’ (Swayambhu)కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. సోషియో ఫాంటసీగా ఇది రూపొందనుంది. నిఖిల్ కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్‌తో రానుంది. ఆగస్టు నుంచి చిత్రీకరణ ప్రారంభమయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని