Rekha: సెక్రటరీతో రేఖ రిలేషన్‌ అంటూ ప్రచారం.. ఖండించిన రైటర్‌

బాలీవుడ్‌ నటి రేఖ (Rekha)పై గత కొన్నిరోజులుగా జరుగుతోన్న ప్రచారాన్ని రచయిత యాసర్ ఉస్మాన్ ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన అన్నారు.

Published : 23 Jul 2023 14:53 IST

 

ముంబయి: బాలీవుడ్‌ సీనియర్‌ నటి రేఖ (Rekha) బయోగ్రఫీ ‘రేఖ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ని ఆధారంగా చేసుకుని గత కొన్నిరోజుల నుంచి ఓ వార్త సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రేఖకు గతంలో తన సెక్రటరీ ఫర్జానాతో రిలేషన్‌లో ఉందని, నటి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని ఆమే ఎక్కువగా కంట్రోల్‌ చేసేదని ఆ కథనాల్లోని సారాంశం. అంతేకాకుండా, రేఖ భర్త చనిపోవడానికి కూడా సెక్రటరీ ఓ కారణం అంటూ జరిగిన ప్రచారంపై తాజాగా రేఖ బయోగ్రఫీని రాసిన రచయిత యాసర్ ఉస్మాన్ స్పందించారు.

భార్యతో సఖ్యత లేదని.. ఆ దర్శకుడు నాతో అభ్యంతరకరంగా మాట్లాడాడు: బాలీవుడ్‌ నటి

తన బుక్‌ను ఆధారంగా చేసుకుని వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన అన్నారు. సెన్సేషన్‌ కావడం కోసం కొన్ని వెబ్‌సైట్స్‌ కావాలనే ఇలాంటి కథనాలు ప్రచురిస్తున్నాయని ఆయన చెప్పారు. ‘రేఖ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’కి కొంతమంది ‘లివ్‌ ఇన్‌ రిలేషన్‌’ అనే పదాలు ఆపాదించారని, అలాంటి పదాలను తాను ఎక్కడా వాడలేదన్నారు. తన రచనను ఆధారంగా చేసుకుని అసత్యంగా వార్తలు ప్రచురించిన వెబ్‌సైట్స్‌ వెంటనే వాటిని తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.

 రేఖ.. నటిగా బాలీవుడ్‌లో సెటిలయ్యారు. ఒకప్పటి బీటౌన్‌ స్టార్‌ హీరోలు వినోద్‌ ఖన్నా, రాజేంద్ర కుమార్‌, జితేంద్ర, ధర్మేంద్ర, రణ్‌ధీర్‌ కపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌తో ఆమె స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. నటిగా కొనసాగుతోన్న తరుణంలోనే ఆమె ముఖేశ్‌ అగర్వాల్‌ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు. పెళ్లైన ఏడు నెలలకే ముఖేశ్ ఆత్మహత్య చేసుకున్నారు. యాసర్ ఉస్మాన్ రచించిన రేఖ (Rekha) బయోగ్రఫీ ‘రేఖ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ’ 2016 నుంచి పాఠకులకు అందుబాటులోకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని