Shouryuv: విజయేంద్ర ప్రసాద్‌ వద్ద పనిచేసి.. ‘హాయ్‌ నాన్న’తో దర్శకుడిగా మారి..: శౌర్యువ్‌ సంగతులివీ

‘హాయ్‌ నాన్న’తో దర్శకుడిగా పరిచయం కానున్నారు శౌర్యువ్‌. నాని హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబరు 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శౌర్యువ్‌ ఈ చిత్ర ప్రచారంలో పాల్గొన్నారు.

Published : 09 Nov 2023 21:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏదైనా సినిమా తెరకెక్కించాలంటే డైలాగ్స్‌, విజువల్స్‌లాంటి అంశాల కంటే కథ ముఖ్యమనే విషయం ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ (Vijayendra Prasad) దగ్గర పనిచేస్తున్న సమయంలో మరింత బాగా అర్థమైందని కొత్త దర్శకుడు శౌర్యువ్‌ (Shouryuv) పేర్కొన్నారు. నాని (Nani) హీరోగా తెరకెక్కుతున్న ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) చిత్రంతో ఆయన దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమా డిసెంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శౌర్యువ్‌ పలు ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా విశేషాలతోపాటు తన వ్యక్తిగత వివరాలను పంచుకున్నారు. విశాఖపట్నంలో పుట్టి పెరిగానని చెప్పిన తాను విజయనగరంలో మెడిసిన్‌ పూర్తి చేశానన్నారు. ఆరో తరగతి చదివే సమయంలోనే ఓ కథ రాశానని, ఏడో తరగతిలో ఉన్నప్పుడు దర్శకుడుకావాలని అనుకున్నానని చెప్పారు. తన తల్లి సలహా మేరకు మెడిసిన్‌ పూర్తయ్యాక చిత్ర పరిశ్రమలోకి వచ్చినట్లు వెల్లడించారు. ముందుగా విజయేంద్ర ప్రసాద్‌ దగ్గర రైటింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరానని, ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు.

ఇది వరమా లేక శాపమా: కీర్తి సురేశ్‌ అసహనం

‘ఆదిత్య వర్మ’ (అర్జున్‌ రెడ్డి తమిళ్‌ రీమేక్‌)లాంటి ఎన్నో సినిమాలకు తాను పని చేశానన్నారు. డైరెక్టర్‌కావాలనే ప్రయత్నంలో భాగంగా వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాతలకు ‘హాయ్‌ నాన్న’ కథ చెప్పానని, వారు హీరో నానికి వినిపించమని సూచించినట్లు తెలిపారు. ‘హాయ్‌ నాన్న’ గురించి చెబుతూ.. ‘‘ఎమోషన్స్‌ తప్ప ఇందులో ఎలాంటి యాక్షన్, ఇతరత్రా అంశాలు ఉండవు’’ అని తెలిపారు. ఈ చిత్రంలో నాని సరసన మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని