Keerthy Suresh: ఇది వరమా లేక శాపమా: కీర్తి సురేశ్‌ అసహనం

రష్మిక డీప్ ఫేక్‌ వీడియోపై అసహనం వ్యక్తం చేశారు నటి కీర్తిసురేశ్‌ (Keerthy Suresh). సామాజిక మాధ్యమాలను మంచి పనుల కోసం ఉపయోగించాలని హితవు పలికారు. 

Updated : 09 Nov 2023 17:50 IST

హైదరాబాద్‌: చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు దారి తీసిన రష్మిక (Rashmika) డీప్‌ ఫేక్ వీడియో ఘటనపై నటి కీర్తిసురేశ్‌ (keerthy suresh) స్పందించారు. ఇలాంటి చెత్త వీడియోలను సృష్టించే బదులు.. ఆ సమయంలో అందరికీ ఉపయోగపడే పని చేసి ఉండాల్సిందని ఆమె అన్నారు. ‘‘నెట్టింట వైరల్‌గా మారిన డీప్‌ఫేక్‌ వీడియో చూస్తుంటే భయం వేస్తోంది. ఈ వీడియో క్రియేట్‌ చేసిన వ్యక్తి టెక్నాలజీని దుర్వినియోగం చేసి ఎదుటి వ్యక్తులను ఇబ్బందిపెట్టే బదులు.. విలువైన సమయాన్ని ఏదైనా మంచి పనికి ఉపయోగించాల్సింది. ప్రస్తుతం ఉన్న రోజుల్లో టెక్నాలజీ మనకు వరమో శాపమో అర్థం కావడం లేదు. ప్రేమ, సానుకూల దృక్పథం, అవగాహన కల్పించడం కోసం ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిద్దాం. అంతేకానీ చెత్తను పంచుకోవడం కోసం కాదు’’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

Samantha: ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టాయి.. ఎంతో బాధపడ్డా: సమంత

రష్మికకు సంబంధించిన ఓ మార్ఫింగ్‌ వీడియో ఇటీవల నెట్టింట వైరల్‌గా మారింది. సోషల్‌ మీడియా స్టార్‌ జారా పటేల్ వీడియోను మార్ఫింగ్‌ చేసి.. రష్మిక ముఖం పెట్టారు. ఇబ్బందికరంగా ఉన్న ఆ వీడియో అంతటా వైరల్‌గా మారింది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాజాగా కత్రినా కైఫ్‌ని టార్గెట్‌ చేసుకుని మరో డీప్‌ఫేక్‌ను క్రియేట్‌ చేశారు. ‘టైగర్‌ 3’లోని టవల్‌ ఫైట్‌ సీక్వెన్స్‌ గురించి అందరికీ తెలిసిందే. ఇందులోని ఆమె ఫొటోని మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని