Tiger 3 ott release: ఓటీటీలో సల్మాన్‌ ‘టైగర్‌3’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా మనీశ్‌ శర్మ దర్శకత్వంలో వచ్చిన ‘టైగర్‌3’ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది

Updated : 05 Jan 2024 18:28 IST

ముంబయి: సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) - కత్రినా కైఫ్‌ (Katrina Kaif) జంటగా రూపొందిన స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘టైగర్‌3’ (Tiger3). మనీశ్‌ శర్మ దర్శకుడు. ‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ చిత్రాలకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. దీపావళి కానుకగా నవంబరు 12న విడుదలైన ఈ మూవీ రూ.450 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సల్మాన్‌ ఫైట్‌ సీక్వెన్స్‌లు.. కత్రినా చేసిన బాత్‌ టవల్‌ ఫైట్‌ సీన్‌ అభిమానులను అలరించాయి. ‘టైగర్‌3’ ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా? అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో శుభవార్త చెప్పింది. జనవరి 7వ తేదీ నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు తెలిపింది.

ఇంతకీ క‌థేంటంటే: విద్వేష‌పు ఆలోచ‌న‌ల్లో ఉన్న మాజీ ఐఎస్ఐ ఏజెంట్ అతీష్ రెహ్మాన్ (ఇమ్రాన్ హ‌ష్మీ) పాకిస్థాన్‌ ప్ర‌ధాన మంత్రి న‌స్రీన్ ఇరానీ (సిమ్రాన్‌)ని హ‌త్య చేసి, ఆ నేరాన్ని ఇండియా ఏజెంట్ టైగ‌ర్ (స‌ల్మాన్‌ఖాన్‌)పై వేయాల‌ని ప‌న్నాగం ప‌న్నుతాడు. న‌స్రీన్ ఇరానీ చేస్తున్న శాంతి ప్ర‌య‌త్నాలు న‌చ్చ‌ని అతీష్‌, పాకిస్థాన్‌ దేశ సైన్యాధికారుల్ని రెచ్చ‌గొట్టి మ‌రీ ఇందుకోసం వ్యూహం ర‌చిస్తాడు. టైగ‌ర్ (స‌ల్మాన్‌ఖాన్‌), అత‌ని భార్య జోయా (క‌త్రినాకైఫ్‌) వ్య‌క్తిగ‌త జీవితంలోకి వెళ్లి వారి బిడ్డ జూనియ‌ర్‌ని అడ్డం పెట్టుకుని ఇద్ద‌రినీ ఇస్తాంబుల్‌లో ఓ ఆప‌రేష‌న్‌కి వాడుకుంటాడు. (Tiger 3 Review in telugu) ఆ ఆప‌రేష‌న్‌తోనే టైగ‌ర్‌నీ, జోయానీ దేశ‌ద్రోహులుగా ప్ర‌పంచం ముందు నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తాడు. మ‌రి అతీష్ అనుకున్న‌ది నెర‌వేరిందా? అత‌ని విద్వేష‌పు ప్ర‌య‌త్నాల్ని టైగ‌ర్ ఎలా తిప్పికొట్టాడనేది  తెర‌పై చూడాల్సిందే.

పూర్తి రివ్యూ కోసం క్లిక్‌ చేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని