War 2: ‘వార్‌ 2’కు హాలీవుడ్‌ యాక్షన్‌?

తెలుగు, హిందీ భాషలకు చెందిన ఇద్దరు అగ్ర హీరోలు తెరపై సందడి చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి రాబోతున్నారు ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌. వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ‘వార్‌ 2’. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు.

Updated : 21 Apr 2024 13:26 IST

తెలుగు, హిందీ భాషలకు చెందిన ఇద్దరు అగ్ర హీరోలు తెరపై సందడి చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి రాబోతున్నారు ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌. వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ‘వార్‌ 2’. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. ఎన్టీఆర్‌ ఇటీవలే ఈ సినిమా సెట్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందులోని యాక్షన్‌ సన్నివేశాల కోసం హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్‌ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ‘‘కెప్టెన్‌ అమెరికా: సివిల్‌ వార్‌’, ‘ఫాస్ట్‌ ఎక్స్‌’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్పిరో రజాటోస్‌ ‘వార్‌ 2’కు యాక్షన్‌ డైరెక్టర్‌గా పనిచేయబోతున్నట్లు సమాచారం. ‘‘ఇందులోని యాక్షన్‌ సన్నివేశాలు మొదటి భాగాన్ని మించేలా ఉండనున్నాయి. ఎన్టీఆర్‌, హృతిక్‌ల మధ్య జరిగే యాక్షన్‌ సీక్వెన్స్‌లను మునుపెన్నడూ చూడని విధంగా తీర్చిదిద్దడానికి అమెరికన్‌ స్టంట్‌ మాస్టర్‌ స్పిరో రజాటోస్‌ను బరిలోకి దించింది చిత్రబృందం. ఇప్పటికే ఆయన ఈ సినిమాకు సంబంధించిన పనిని కూడా మొదలుపెట్టార’’ని సన్నిహిత వర్గాలు తెలిపాయి. యశ్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని