Kalki: విదేశాల్లో ‘కల్కి’ హవా.. ఒక్కరోజులో ఎన్నివేల టికెట్స్‌ అమ్ముడయ్యాయంటే!

విదేశాల్లో కల్కి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్‌ చేయగా టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

Published : 07 Jun 2024 13:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ ప్రియులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సినిమా  ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవర్సీస్‌లో ఈ సినిమా జూన్‌ 26నే విడుదల కానుంది. అక్కడ దీని అడ్వాన్స్‌ బుకింగ్స్ ఓపెన్‌ చేయగా టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. విదేశాల్లో ఈ చిత్రాన్ని 124 లోకేషన్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు 116 థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్‌ చేయగా ఒక్కరోజులోనే 4933 టికెట్స్‌ అమ్ముడయ్యాయి. త్వరలోనే థియేటర్ల సంఖ్య పెంచనున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్ (Amitabh Bachchan) అశ్వత్థామ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తన బ్లాగ్‌లో షేర్‌ చేసిన ఓ అప్‌డేట్‌ అభిమానుల్లో జోష్‌ నింపుతోంది. ‘మరో బిజీ డే. నా అప్‌కమింగ్‌ సినిమాలోని పాటకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాను. త్వరలోనే అది మీ ముందుకు రానుంది’ అని తెలిపారు. దీంతో కల్కి (Kalki 2898 AD) పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులే అని అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ చిత్రబృందం కూడా అమితాబ్‌కు సంబంధించిన కొత్త పోస్టర్‌ను పంచుకొని జూన్‌ 10న ట్రైలర్‌ రానున్నట్లు తెలిపింది. ప్రభాస్ (Prabhas) సరసన దీపిక పదుకొణె (Deepika Padukone) నటిస్తుండగా.. సీనియర్‌ హీరో కమల్‌ హాసన్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. అలాగే పశుపతి, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

చంద్రబాబును కలిసిన అశ్వినీదత్‌

‘కల్కి’ నిర్మాత అశ్వినీదత్‌ (Ashwini Dutt) తెదేపా అధినేత చంద్రబాబును కలిశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే సోషల్‌ మీడియాలో అభినందనలు తెలిపిన అశ్వినిదత్‌.. తాజాగా చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని