Anil kapoor: దక్షిణాది సినిమాల కారణంగానే నేను ఈ స్థాయిలో ఉన్నా: అనిల్‌ కపూర్‌

సినిమాలను భాష పరంగా విడదీయకూడదని బాలీవుడ్‌ హీరో అనిల్‌కపూర్‌ అన్నారు.

Published : 29 Feb 2024 16:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్: దక్షిణాది సినిమాల వల్లే తాను స్టార్‌గా ఎదిగానన్నారు బాలీవుడ్‌ హీరో అనిల్‌ కపూర్‌ (anil kapoor). తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్‌ వర్సెస్‌ బాలీవుడ్‌ అనే అంశంపై స్పందించారు. గత కొన్ని సంవత్సరాలుగా చర్చనీయాంశమైన ఈవిషయంపై అనిల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్నాయి.

‘దర్శక నిర్మాతలు మంచి పాత్రలకు నన్ను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ విషయంలో నేను అదృష్టవంతుడిని. నాకు సమయం దొరికినప్పుడల్లా యూత్‌తో ఎక్కువగా సంభాషిస్తూ ఉంటాను. వారి కొత్త ఆలోచనలు ఆసక్తిగా ఉంటాయి. నేను హీరోగా ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం దక్షిణాది చిత్రాలే. ఇప్పటివరకు నేను చేసిన ఎక్కువ సినిమాలు సౌత్‌ రీమేక్‌లే. దేశంలో ఉన్న గొప్ప నటుల్లో ఎక్కువమంది సౌత్‌ సినిమాలను రీమేక్‌ చేసినవారే. కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్‌ చిత్రాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. ‘బాహుబలి’, ‘కేజీఎఫ్‌’, ‘ఆర్ఆర్‌ఆర్‌’, ‘పుష్ప’ సినిమాలు పెద్ద విజయాలు సాధించాయి.  దక్షిణాదిలో గొప్ప నటులు ఉన్నారు. అలాగే, మంచి కథలు ఉన్నాయని నేను నమ్ముతున్నా. సినిమాలను టాలీవుడ్‌, బాలీవుడ్‌ అంటూ భాష పరంగా విడదీయకూడదు. అన్నిటినీ భారతీయ చిత్రాలుగానే చూడాలి’ అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

నన్ను క్షమించండి.. ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నా: నాగబాబు

ప్రస్తుతం అనిల్‌ కపూర్‌ ‘యానిమల్‌’ విజయంతో ఆనందంగా ఉన్నారు. సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రంలో రణ్‌బీర్‌కు నాన్నగా ఆయన నటన మెప్పించింది. తండ్రి సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఆ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ‘యానిమల్‌ పార్క్‌’ పేరుతో త్వరలోనే దీనికి సీక్వెల్ రూపొందనున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని