Vindhya Vishaka: దుస్తులు మార్చుకోవడానికీ గదులుండవు.. ఆ క్షణం షాకయ్యా: యాంకర్‌ వింధ్య

తన అభిరుచిని కుటుంబసభ్యులు ఎంతగానో సపోర్ట్‌ చేశారని.. అందువల్లే తాను కెరీర్‌లో రాణించగలుగుతున్నానని యాంకర్‌ వింధ్య విశాఖ (Vindhya Vishaka) అన్నారు.

Published : 14 Apr 2024 00:05 IST

హైదరాబాద్‌: ఐపీఎల్‌, ప్రొకబడ్డీ లీగ్‌లతోపాటు పలు క్రికెట్‌ టోర్నమెంట్స్‌కు తెలుగు ప్రెజంటర్‌గా వ్యవహరిస్తూ విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు తెలుగమ్మాయి వింధ్యా విశాఖ. కుటుంబసభ్యుల ప్రోత్సహం వల్లే కెరీర్‌లో తాను రాణించగలుగుతున్నానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కాలేజీ రోజుల్లోనే న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన ఆమె.. కొంతకాలం మోడలింగ్‌లోనూ శిక్షణ పొందానని చెప్పారు.

‘‘కాలేజీ రోజుల్లో పలు అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచా. దాంతో మోడలింగ్‌ చేయాలనే ఆలోచన వచ్చింది. పలు ఉద్యోగాల అనంతరం మోడలింగ్‌లో శిక్షణ తీసుకున్నా. హైదరాబాద్‌లో జరిగిన ఒక ఫ్యాషన్‌ వీక్‌లో పాల్గొన్నా. అదే నా ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ షో. అక్కడి వాతావరణం నాకు నచ్చలేదు. దుస్తులు మార్చుకోవడానికీ సరైన గదులుండేవి కావు. బ్యాక్‌ స్టేజ్‌లో అందరి ముందు దుస్తులు మార్చుకోవాల్సి ఉంటుంది. అది చూసి షాకయ్యా. ఆ రంగం నాకు సెట్‌ కాదనిపించింది. మోడలింగ్‌ వదిలేశా. అన్ని చోట్లా ఇలాగే ఉంటుందని చెప్పను. నాకు ఎదురైన అనుభవం మాత్రం ఇదే’’ అని వింధ్య తెలిపారు. ‘గోపాల గోపాల’, ‘ముకుందా’ చిత్రాల్లో తనకు అవకాశం వచ్చిందని.. ఆసక్తి లేని కారణంతో నో చెప్పానని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని