Anitha: అప్పుడు నష్టాలు చూశా.. ఒత్తిడికి లోనయ్యా: అనితా చౌదరి

నటి అనితా చౌదరి (Anitha) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సీరియల్స్‌ నిర్మాణంలో బిజీగా ఉండటం వల్ల గొప్ప సినిమాలు వదులుకున్నానని ఆమె చెప్పారు.

Published : 04 Oct 2023 18:52 IST

హైదరాబాద్‌: యాంకర్‌గా కెరీర్‌ మొదలుపెట్టి పలు సీరియల్స్‌, సినిమాల్లో నటించి ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు నటి అనితా చౌదరి (Anitha Chowdary). ప్రస్తుతం సహాయనటి పాత్రల్లో నటిస్తోన్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అనుకోకుండానే తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానన్నారు. పలు మంచి పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించినందుకు ఆనందంగా ఉందన్నారు. పవన్‌కల్యాణ్‌ ‘తొలిప్రేమ’లో హీరో సోదరి పాత్రలో నటించే అవకాశం మొదట తనకే వచ్చిందని.. ఆ సమయంలో తాను ఓ సీరియల్‌లో యాక్ట్‌ చేస్తున్నానని, అందుకే ఆ ఆఫర్‌ వదులుకోవాల్సి వచ్చిందన్నారు.

Devara: ‘దేవర’.. ఒక్క సంభాషణా కట్‌ చేయలేం.. పార్ట్‌ 2 ప్రకటించిన కొరటాల శివ

అనంతరం ఆమె సీరియల్‌ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం గురించి మాట్లాడుతూ.. ‘‘నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టినందుకు పలు సందర్భాల్లో బాధపడ్డా. నేను ఎప్పుడూ నిర్మాతగా మారాలని ప్లాన్‌ చేయలేదు. మా ఇంట్లో వాళ్లకూ ఇష్టం లేదు. కాకపోతే, స్నేహితులు కోరడంతో నిర్మాతగా వచ్చా. ప్రొడెక్షన్‌కు సంబంధించిన అన్ని పనులను నేను దగ్గరుండి చూసుకునేదాన్ని. దీంతో గొప్ప సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. ‘శతమానం భవతి’ కూడా వదులుకున్నా. నష్టాలు కూడా చూశా. అప్పుడు ఎంతో ఒత్తిడికి లోనయ్యా’’ అని ఆమె చెప్పారు. ‘సంతోషం’, ‘నువ్వే నువ్వే’, ‘ఉయ్యాలా జంపాలా’, ‘ఛత్రపతి’ వంటి చిత్రాలు అనితకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని