Devara: ‘దేవర’.. ఒక్క సంభాషణా కట్‌ చేయలేం.. పార్ట్‌ 2 ప్రకటించిన కొరటాల శివ

‘జనతా గ్యారేజ్‌’ తర్వాత హీరో ఎన్టీఆర్‌- డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో ‘దేవర’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శకుడు తెలిపారు.

Updated : 04 Oct 2023 17:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్టీఆర్‌ (NTR) హీరోగా తాను తెరకెక్కిస్తున్న ‘దేవర’ (Devara) సినిమాకు సంబంధించి అభిమానులకు ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చారు దర్శకుడు కొరటాల శివ (Koratala Siva). ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. తొలిభాగం 2024 ఏప్రిల్ 5న వస్తుందని గుర్తు చేశారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. మరి, ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రూపొందించడానికి కారమేంటో దర్శకుడి మాటల్లోనే.. ‘‘కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసేదికావడంతో ‘దేవర’ కథ విషయంలో ఎన్టీఆర్‌సహా మేమంతా ఉద్వేగానికి గురయ్యాం. ఇందులో బలమైన పాత్రలెన్నో ఉన్నాయి. ఎంతో ఉత్సాహంగా చిత్రీకరణ ప్రారంభించిన తర్వాత ఆ ప్రపంచం రోజురోజుకు పెద్దదైపోయింది. కొన్ని షెడ్యూల్స్‌ షూటింగ్‌ ఔట్‌పుట్‌తో మాలో రెట్టింపు ఉత్సాహం కలిగింది. నిడివిని దృష్టిలో పెట్టుకుని ఒక్క సన్నివేశం, ఒక్క సంభాషణ కూడా తొలగించలేమని అంతా ఫీలయ్యాం. ఒక్క పార్ట్‌లో ఇంత పెద్దకథను ముగించేయడం తప్పు అన్న నిర్ణయానికి వచ్చాం. పాత్రలు, వాటి భావోద్వేగాలను పూర్తిస్థాయిలో చూపించాలంటే ఒక్క పార్ట్‌లో కుదరదనుకున్నా. అందరితో చర్చించి పార్ట్‌ 2 నిర్ణయం తీసుకున్నా’’ అని వివరించారు.

రాముడిగా రణ్‌బీర్‌.. సీతగా సాయిపల్లవి ఫిక్స్‌!

అభివృద్ధి చెందని ఓ తీర ప్రాంత నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రూపొందుతోంది. తమకు భయం తెలియదంటూ విర్రవీగే వారికి భయాన్ని పరిచయం చేసే పవర్‌ఫుల్‌ పాత్రలో తారక్‌ కనిపించనున్నారు.  ఈ చిత్రంతో జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) దక్షిణాది చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతోంది. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల.. హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ షూట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని