Sivakarthikeyan: సినిమా ఫ్లాప్.. పూర్తి బాధ్యత నాదే: శివ కార్తికేయన్‌

‘మహావీరుడు’(Mahaveerudu) సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా పాల్గొంటున్నారు నటుడు శివకార్తికేయన్‌ (Siva Karthikeyan). తాజాగా ఆయన ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొని ఇటీవల విడుదలైన తన చిత్రాల ఫలితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Published : 10 Jul 2023 17:58 IST

చెన్నై: శివ కార్తికేయన్‌ (Siva Karthikeyan) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘మహావీరన్‌’ (Mahaveeran). అదితి శంకర్‌ కథానాయిక. త్వరలో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో శివ కార్తికేయన్‌ తాజాగా విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కథ తనకు ఎంతో బాగా నచ్చిందని అన్నారు. ప్రేక్షకులు తప్పకుండా ఈ చిత్రానికి కనెక్ట్‌ అవుతారని.. సినీ ప్రియులను అలరించే సన్నివేశాలు ఇందులో మెండుగా ఉన్నాయని తెలిపారు. అనంతరం ఆయన.. ఇటీవల విడుదలైన తన సినిమాల రిజల్ట్‌పై మాట్లాడారు. ‘‘నేను నటించిన ఏదైనా సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం అందుకుంటే దాని పూర్తి బాధ్యత నేనే వహిస్తా. అలాగే, నేను నటించిన చిత్రాలు మంచి విజయాన్ని అందుకుంటే ఆ క్రెడిట్‌ టీమ్‌ అందరికీ సొంతం’’ అని ఆయన తెలిపారు.

‘మహావీరన్‌’ ఫాంటసీ కథతో సిద్ధమైంది. మడోన్‌ అశ్విన్‌ దర్శకుడు. జులై 14న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘మహావీరుడు’ పేరుతో విడుదల చేయనున్నారు. ఇక, శివకార్తికేయన్‌కు తెలుగులో మంచి మార్కెట్‌ ఉంది. ‘రెమో’తో ఆయన టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ సొంతం చేసుకున్నారు. ఆయన నటించిన ‘డాక్టర్‌’, ‘డాన్‌’ చిత్రాలు ఇక్కడి వారినీ అలరించాయి. ఇటీవల ఆయన ‘ప్రిన్స్‌’ అనే డైరెక్ట్‌ తెలుగు సినిమాలో యాక్ట్‌ చేయగా.. అది మిశ్రమ స్పందనలకు పరిమితమైంది. ఆ సినిమా తర్వాత ఆయన నుంచి వస్తోన్న చిత్రమిదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని