Thaman: ఆన్‌లైన్‌ నెగెటివిటీపై తమన్‌ ఏమన్నారంటే?

సోషల్‌మీడియా నెగెటివిటీపై పెదవి విప్పారు సంగీత దర్శకుడు తమన్‌(Thaman). ప్రశంసలే కాదు విమర్శలనూ తీసుకోవాలని అన్నారు.

Updated : 10 Jul 2023 16:58 IST

హైదరాబాద్‌: మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ (Thaman) ఈ మధ్యకాలంలో ఎక్కువగా నెగెటివిటీని ఎదుర్కొంటున్నారు. ఆయన వర్క్‌ను తక్కువ చేస్తూ పలువురు నెటిజన్లు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. సోషల్‌మీడియా వ్యతిరేకతపై స్పందించారు. ‘‘నెటిజన్లు పొగిడిన సమయంలో ఎలా అయితే తీసుకుంటామో.. విమర్శలు కూడా అలాగే తీసుకోవాలి’’ అని ఆయన అన్నారు.

దీనిపై ఓ విలేకరి స్పందిస్తూ.. ‘‘మీరు చెప్పింది బాగానే ఉంది కానీ, ఈ మధ్య మీపై వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారు. క్రికెట్‌ మీద పెట్టిన శ్రద్ధ మ్యూజిక్‌పై పెట్టొచ్చుగా అని కామెంట్‌ చేస్తున్నారు?’’ అని అడగ్గా.. తమన్‌ తనదైన శైలిలో బదులిచ్చారు. ‘‘నాకు మద్యం అలవాటు లేదు. గర్ల్‌ఫ్రెండ్స్‌ లేరు. ఏ ఇతర వ్యసనాలూ లేవు. నాకు ఉన్న ఒకే ఒక్క ఎమోషన్‌ క్రికెట్‌. ప్రతిరోజూ రాత్రి 9 గంటలకు, నా స్నేహితులందరితో కలిసి క్రికెట్‌ ఆడుతుంటా. నా టీమ్‌ పేరు తమన్‌ హిట్టర్స్‌. మా టీమ్‌లో మ్యూజిషియన్స్‌, డ్యాన్సర్స్‌ ఉన్నారు. అదే నా ఎక్సర్‌సైజ్‌, నా ఎమోషనల్‌ నెట్‌వర్క్‌. నేను ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా ఎందుకు చెప్పాలి? నా పని వదిలేసి నేను వెళ్లడం లేదు. వర్క్‌ టైమ్‌ అయ్యాక  రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకూ క్రికెట్‌ ఆడి.. ఇంటికి వెళ్లిపోతా. అలా, చేయడం వల్ల నా ఒత్తిడి కొంతవరకూ తగ్గుతుంది’’ అని తమన్‌ తెలిపారు.

ఇక, ఇదే ఇంటర్వ్యూలో ఆయన.. ‘బ్రో’, ‘గుంటూరు కారం’ ప్రాజెక్ట్‌లపై మాట్లాడారు. ‘‘బ్రో’ నుంచి విడుదలైన ‘మై డియర్‌ మార్కండేయ’ పాటకు మంచి స్పందన వచ్చింది. ఇక, ఈసినిమా కోసం ‘టైమ్‌’ కాన్సెప్ట్‌ బేస్‌ చేసుకుని నేనొక స్పెషల్‌ ప్రమోషనల్‌ సాంగ్‌ క్రియేట్‌ చేశా. సినిమా ఎండ్‌ టైటిల్స్‌లో దాన్ని ప్లే చేస్తారు. ‘గుంటూరు కారం’కు మ్యూజిక్‌ వర్క్‌ జరుగుతోంది. సూపర్‌స్టార్‌ అభిమానులు ఈ చిత్రాన్ని ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తారు. ముఖ్యంగా మ్యూజిక్‌ వాళ్లకు బాగా నచ్చుతుంది’’ అని అన్నారు. అనంతరం ఆయన.. ఇటీవల తాను ‘బేబీ’ ట్రైలర్‌ చూశానని.. సినిమా కోసం తాను ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు