Ilaiyaraaja: ‘మంజుమ్మ‌ల్ బాయ్స్‌’నిర్మాణ సంస్థకు ఇళయరాజా లీగల్‌ నోటీసులు

మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇళయరాజా ‘మంజుమ్మ‌ల్ బాయ్స్‌’ నిర్మాణ సంస్థకు లీగల్ నోటీసులు పంపడం చర్చనీయాంశంగా మారింది.

Updated : 23 May 2024 13:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ‘మంజుమ్మ‌ల్ బాయ్స్‌’ నిర్మాణ సంస్థకు లీగల్‌ నోటీసులు పంపారు. తన అనుమతి లేకుండా ఓ పాటను ఆ సినిమాలో ఉపయోగించారని పేర్కొన్నారు. ఇది కాపీరైట్‌ ఉల్లంఘన కిందకు వస్తుందని ఆరోపించారు.

ఇటీవల విడుదలై అన్ని భాషల్లోనూ ‘మంజుమ్మ‌ల్ బాయ్స్‌’ (Manjummel Boys movie) విజయాన్ని అందుకొన్న విషయం తెలిసిందే. య‌థార్థ క‌థ‌ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో గతంలో ఇళయరాజా కంపోజ్‌ చేసిన ‘గుణ’లోని పాటను వాడారు. ‘కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే..’ పాటను క్లైమాక్స్‌లో ఉపయోగించారు. అయితే, తన అనుమతి లేకుండా ఈ హిట్ సాంగ్‌ను వాడుకున్నారని ‘మంజుమ్మ‌ల్ బాయ్స్‌’ చిత్ర నిర్మాణ సంస్థకు ఇళయరాజా తరఫు న్యాయవాది లీగల్ నోటీసులు పంపారు. సినిమాలో పాటను ఉపయోగించాలంటే సంగీత దర్శకుడి దగ్గర అనుమతి తీసుకోవాలని, లేదంటే కాపీరైట్‌ను ఉల్లంఘించినట్లేనని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది. ఇక పాటలను అనుమతిలేకుండా స్టేజ్‌ షోలలో పాడకూడదని, సినిమాల్లోనూ ఉపయోగించకూడదని గతంలో ఇళయరాజా ఆంక్షలు విధించారు.

నా గురించి అలా రాయడం చూసి బాధేసింది: లయ

‘కూలీ’కు ఇటీవల నోటీసులు

రజనీకాంత్‌ నటిస్తున్న ‘కూలీ’ నిర్మాణ సంస్థకు కూడా ఇళయరాజా (Ilaiyaraaja) ఇటీవల లీగల్ నోటీసులు పంపారు. ఈ సినిమా టైటిల్‌ టీజర్ విడుదల చేయగా.. అందులో రజనీకాంత్‌ గతంలో నటించిన ‘తంగమగన్‌’లోని ‘వా వా పక్కమ్ వా’ పాట బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఉపయోగించారు. ఇది తాను కంపోజ్‌ చేసిన పాట అని ఇళయరాజా పేర్కొన్నారు. తన అనుమతి లేకుండా వాడారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ మ్యూజిక్‌ను వెంటనే తొలగించాలని, లేకుంటే ఆ పాటకు అనుమతి తీసుకోవాలని సన్‌ పిక్చర్స్‌కు ఇళయరాజా నోటీసు పంపారు. అలా చేయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని