Sivakarthikeyan: శివ కార్తికేయన్‌ నన్ను దారుణంగా మోసం చేశాడు.. జీవితంలో అతడితో కలవను: సంగీత దర్శకుడు

సంగీత దర్శకుడు ఇమ్మాన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. శివ కార్తికేయన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.

Updated : 18 Oct 2023 15:01 IST

చెన్నై: నటుడు శివకార్తికేయన్‌ (Sivakarthikeyan)తో మనస్పర్థలు తలెత్తడంపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తొలిసారి మాట్లాడారు సంగీత దర్శకుడు ఇమ్మాన్ (Imman). శివ కార్తికేయన్‌ తనని దారుణంగా మోసం చేశాడని అన్నారు. ఇక, ఈ జీవితంలో అతడితో కలిసి పనిచేయనన్నారు.

‘‘ఈ  జీవితంలో అతడితో కలిసి పనిచేయడం జరగదు. వ్యక్తిగత కారణాల వల్లే నేను ఈ నిర్ణయం తీసుకున్నా. అతడిని నేనెంతో నమ్మా. కాకపోతే నన్ను దారుణంగా మోసం చేశాడు. అతడు చేసిన మోసాన్ని తెలుసుకునే సమయానికి చాలా ఆలస్యమైపోయింది. ఎందుకిలా చేశావంటూ నిలదీశా. అతడు ఏమన్నాడో మాత్రం చెప్పలేను. నా పిల్లల భవిష్యత్తు, కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకునే  అతడు ఏం చేశాడో ఇప్పుడు బయటపెట్టలేకపోతున్నా. నాకు ఏదైతే జరిగిందో దానికి పూర్తి కారణం అతడే అని చెప్పను. కానీ, ముఖ్య కారణం మాత్రం అతడే. అతడి కుటుంబంతోనూ నాకు మంచి అనుబంధం ఉంది. ఇలాంటి ద్రోహానికి పాల్పడతాడని అస్సలు అనుకోలేదు’’ అని ఇమ్మాన్ ఆరోపణలు చేశారు. శివ కార్తికేయన్‌ తనను ఏవిధంగా ఇబ్బందిపెట్టారనేది మాత్రం ఆయన చెప్పలేదు.

వైవాహిక అత్యాచారాన్ని.. శృంగార సీన్లు అంటారా?: మెహ్రీన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

శివ కార్తికేయన్‌ హీరోగా నటించిన చాలా చిత్రాలకు ఇమ్మాన్‌ స్వరాలు అందించారు. ‘సీమ రాజా’, ‘రజినీ మురుగన్‌’, ‘నమ్మ వీటు పిల్లై’ వంటి చిత్రాలు వీరి కాంబోలో వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని