Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియన్ సినిమాల హవా.. మిలియన్ల వ్యూస్‌తో టాప్‌లో..

2023 జులై నుంచి డిసెంబర్‌ వరకు వచ్చిన వ్యూస్‌ను నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది. అందులో ఇండియన్‌ కంటెంట్‌ టాప్‌లో నిలిచింది.

Updated : 25 May 2024 12:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) ఇండియన్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల హవా కొనసాగుతోంది. గతేడాది నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మన సినిమాలు కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకొని టాప్‌లో ఉన్నాయి. తాజాగా ఈ సంస్థ 2023లో అత్యధిక వ్యూస్‌ సాధించిన వాటి వివరాలను ప్రకటించింది. ‘వాట్‌ వి వాచ్డ్‌: ఎనెట్‌ఫ్లిక్స్‌ ఎంగేజ్‌మెంట్ రిపోర్ట్‌’ పేరుతో గతేడాది జులై నుంచి డిసెంబర్‌ వరకు వచ్చిన వ్యూస్‌ను వెల్లడించింది. ఇందులో ఇండియన్‌ కంటెంట్‌ సత్తా చాటింది. మూవీస్‌, సిరీస్‌, షోలు అన్ని కలిపి వన్‌ బిలియన్‌ వ్యూస్‌ సాధించాయి.

ప్రపంచవ్యాప్తంగా 2023 సెకండ్ హాఫ్‌లో 90 బిలియన్ల గంటలు నమోదైనట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. కరీనా కపూర్‌ (Kareena Kapoor) ప్రధానపాత్రలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘జానెజాన్‌’ 20.2మిలియన్ల వ్యూస్‌తో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో 16.2 మిలియన్ల వ్యూస్‌తో షారుక్‌ నటించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘జవాన్‌’, మూడులో విశాల్‌ భరద్వాజ్‌ నటించిన ‘ఖుషియా’ (12.1 మిలియన్లు) నిలిచాయి. వీటితో పాటు ‘ఓఎంజీ2’, ‘లస్ట్‌ స్టోరీస్‌2’, ‘డ్రీమ్‌ గర్ల్‌2’ కూడా మంచి వ్యూస్‌ను దక్కించుకున్నాయి. 1984లో జరిగిన భోపాల్‌ దుర్ఘటన ఆధారంగా తెరకెక్కించిన ‘ది రైల్వే మెన్‌’ వెబ్‌ సిరీస్‌ 10.6 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది.

ఇక 2023 మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూసిన సినిమాగా ‘లీవ్‌ ద వరల్డ్‌ బిహైండ్‌’ 121మిలియన్ల వ్యూస్‌తో మొదటిస్థానంలో ఉంది. వెబ్‌ సిరీస్‌ విషయానికొస్తే.. 72మిలియన్ల తో ‘వన్‌ పీస్‌’ టాప్‌లో నిలిచింది.

కేన్స్‌లో చరిత్ర సృష్టించిన భారతీయ నటి.. ‘ఉత్తమ నటి’గా అవార్డు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని