Suriya: పద్దెనిమిదేళ్ల తర్వాత జోడీగా..

ఆఫ్‌స్క్రీన్‌, ఆన్‌స్క్రీన్‌లో హిట్‌ జోడీ అయిన సూర్య, జ్యోతిక తమిళంలో ‘పూవెల్లం కేట్టుప్పార్‌’ మొదలుకొని ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించి, మెప్పించారు.

Updated : 22 Apr 2024 12:12 IST

ఫ్‌స్క్రీన్‌, ఆన్‌స్క్రీన్‌లో హిట్‌ జోడీ అయిన సూర్య, జ్యోతిక తమిళంలో ‘పూవెల్లం కేట్టుప్పార్‌’ మొదలుకొని ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించి, మెప్పించారు. మళ్లీ వీరిద్దరిని తెరపై ఎప్పుడెప్పుడు జంటగా చూస్తామా అని ఎదురు చూస్తున్న సినీప్రియులకు ఓ తీపి కబురు వినిపించారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్టు రాబోతున్నట్లు సమాచారం. ‘‘బెంగుళూరు డేస్‌’ ఫేమ్‌ అంజలి మేనన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో సూర్య, జ్యోతిక జంటగా నటించనున్నారు. ప్రస్తుతం ఈ విషయముపై వీరిద్దరితో చర్చలు జరుపుతోంది చిత్రబృందం. త్వరలో దీనికి సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నార’ని సన్నిహితవర్గాలు తెలిపాయి. దాదాపు 18 ఏళ్ల తరవాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.


‘సూర్య 44’ కొత్త ముచ్చట్లు..

త్వరలో ‘కంగువా’తో తెరపైకి రావడానికి సిద్ధమవుతున్న సూర్య.. ఇటీవలే దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజుతో తన 44వ చిత్రాన్ని ప్రకటించారు. దీని చిత్రీకరణను జూన్‌లో మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొత్త విషయాల్ని ప్రకటించారు. ‘సైంధవ్‌’ ఫేమ్‌ సంతోష్‌ నారాయణన్‌ ఈ సినిమా సంగీత దర్శకుడిగా పనిచేయబోతున్నట్లు తెలిపింది చిత్రబృందం. పీరియాడిక్‌ వార్‌ అండ్‌ లవ్‌ నేపథ్యంలో దీన్ని తీర్చిద్దుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాతికి ఈ సినిమా విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని