Kiraak RP: సైలెంట్‌గా.. కిరాక్‌ ఆర్పీ వివాహం

కిరాక్‌ ఆర్పీ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాను ప్రేమించిన అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశారు.

Published : 30 Nov 2023 15:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘జబర్దస్త్‌’ ఫేమ్‌ కిరాక్‌ ఆర్పీ (Kiraak RP) బ్యాచిలర్‌ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తాను ప్రేమించిన అమ్మాయి లక్ష్మీ ప్రసన్న మెడలో మూడు ముళ్లు వేశారు (Kiraak RP Wedding). ఇరువురు కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వారివురు ఒక్కటయ్యారు. విశాఖపట్నంలోని ఓ హోటల్‌లో వీరి వివాహం నవంబరు 29న రాత్రి జరిగింది. ‘‘మేం ప్రేమ వివాహం చేసుకున్నాం. ప్రసన్నది వైజాగ్‌. గతేడాది మా నిశ్చితార్థం జరిగింది. ఆ వేడుకకు వి.ఐ.పి.లు, సినీ సెలబ్రిటీలు వచ్చారు. వివాహాన్ని మాత్రం ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలోనే చేసుకోవాలనుకున్నాం. అందుకే గోప్యంగా ఉంచాం’’ అని కిరాక్‌ ఆర్పీ తెలిపారు.

అందుకే వైజాగ్‌ నాకు ప్రత్యేకం: ‘హాయ్‌ నాన్న’ ఈవెంట్‌లో నాని

కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న కిరాక్‌ ఆర్పీ, లక్ష్మీ ప్రసన్నల ఎంగేజ్‌మెంట్‌ 2022 మేలో హైదరాబాద్‌లో జరిగింది. ‘వజ్ర కవచధర గోవింద’, ‘ఇదేం దెయ్యం’, ‘ఎంఎంఓఎఫ్‌’ తదితర చిత్రాల్లో నటించిన ఆర్పీ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో హోటల్స్‌ నడుపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని