Jailer 2: Jailer 2: ‘జైలర్‌ 2’ టైటిలిదే.. హిట్‌ మూవీ సీక్వెల్‌పై వైరలవుతోన్న అప్‌డేట్స్‌

రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కనున్న ‘జైలర్‌ 2’కు సంబంధించిన అప్‌డేట్స్ సోషల్ మీడియాలో తెగ షేర్‌ అవుతున్నాయి.

Published : 13 Apr 2024 00:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ (Nelson Dilipkumar) దర్శకత్వంలో రజనీకాంత్ (Rajinikanth) నటించిన ‘జైలర్‌’ (Jailer) ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. గతేడాది విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో దీని సీక్వెల్‌ (జైలర్‌2) కోసం సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన కొన్ని అప్‌డేట్స్‌ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఈ పవర్‌ఫుల్‌ సీక్వెల్‌కు ‘హుకుం’(Hukum) అనే టైటిల్‌ను ఖారారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. రజనీకాంత్‌కు నెల్సన్‌ స్క్రిప్ట్‌ కూడా వినిపించగా, ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు టాక్‌ వినిపిస్తోంది. షూటింగ్‌ ఈ ఏడాది చివరికి ప్రారంభించాలని చిత్రబృందం భావిస్తోందట. ఇదొక ఫ్రాంచైజీగా మారనుందనేది తమిళ సినీవర్గాల మాట. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో తలైవాను చూడొచ్చని ఆనందిస్తున్నారు. గతేడాది విడుదలైన ‘జైలర్‌’ రూ.600 కోట్లకుపైగా వసూలు చేసి ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. రజనీకాంత్ భార్యగా రమ్యకృష్ణ నటించగా మోహన్‌లాల్‌, జాకీ ష్రాఫ్‌, శివరాజ్‌కుమార్‌, తమన్నా, సునీల్‌, యోగిబాబు కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్‌ రవిచందర్‌ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రస్తుతం రజనీకాంత్‌ టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వెట్టయాన్‌’ తెలుగులో ‘వేటగాడు’లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌, రానా, ఫహాద్‌ ఫాజిల్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దీని చిత్రీకరణ ఇప్పటికే 80శాతం పూర్తయింది. తర్వాత లోకేష్‌ కనగరాజ్‌తో ఓ సినిమా లైనప్‌లో ఉంది. ఇది పూర్తయ్యాక ‘జైలర్‌ 2’ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని