James Cameron: రాజమౌళిపై మరోసారి ప్రశంసలు కురిపించిన జేమ్స్‌ కామెరూన్‌

రాజమౌళిపై హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ (James Cameron) ప్రశసంలు కురిపించారు.

Updated : 07 Feb 2024 13:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ (James Cameron) దర్శకధీరుడు రాజమౌళిపై (SS Rajamouli) మరోసారి ప్రశంసలు కురిపించారు. 51వ వార్షిక శాటర్న్‌ అవార్డుల వేడుక ఇటీవల అమెరికాలో ఘనంగా జరిగింది. దీనికి హాజరైన జేమ్స్‌ కామెరూన్‌ గతేడాది రాజమౌళితో గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నారు.

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో రాజమౌళి అద్భుతం చేశారు. ఆయన్ను కలవడం ఎప్పటికీ మర్చిపోలేను. ప్రపంచవేదికపై ఇండియన్‌ సినిమాను చూడడం ఆనందంగా అనిపించింది’ అని చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు. గతంలోనూ జేమ్స్‌ కామెరూన్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను పొగడ్తలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆ సినిమాను మొదటిసారి వీక్షించి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. గ్రాఫిక్స్‌ మాత్రమే కాదు కథలో ఉన్న ప్రతి పాత్రను చాలా బాగా చూపించారని.. స్టోరీ చెప్పడంలో షేక్‌స్పియర్‌ను తలపించారని ప్రశంసించారు. జేమ్స్‌ కామెరూన్‌ను కలవడంపై రాజమౌళి గతంలో పోస్ట్‌ పెట్టారు. ‘ఆయన నాతో 10 నిమిషాలు మాట్లాడారంటే నమ్మలేకపోతున్నా. నేను దర్శకత్వం వహించిన సినిమాను ఆయన విశ్లేషించి చెప్పడాన్ని జీవితంలో మర్చిపోలేను’ అన్నారు.

బంధుప్రీతి పేరుతో వాళ్లను నిందించొద్దు..: మృణాల్‌ ఠాకూర్‌

రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబు (Mahesh Babu)తో తీయనున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ‘ఇండియానా జోన్స్‌’లా ఉండనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయింది. సంగీతానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియపై దృష్టిసారించినట్లు సమాచారం. ఈ పనులన్నీ ఒక కొలిక్కి వచ్చిన అనంతరం సినిమా వివరాలను రాజమౌళి స్వయంగా వెల్లడించనున్నారు. ఇందులో ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహస వీరుడి పాత్రలో మహేశ్‌ కనిపించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని