Mrunal Thakur: బంధుప్రీతి పేరుతో వాళ్లను నిందించొద్దు..: మృణాల్‌ ఠాకూర్‌

బంధుప్రీతి పేరుతో స్టార్‌ కిడ్స్‌ను నిందించొద్దని నటి మృణాల్ ఠాకూర్‌ (Mrunal Thakur) అన్నారు.

Published : 07 Feb 2024 11:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  బంధుప్రీతి (నెపోటిజం)పై ఇప్పటికే చాలా మంది స్టార్స్ పలు ఇంటర్వ్యూల్లో వారి అభిప్రాయాలను తెలిపారు. నటి మృణాల్ ఠాకూర్‌ (Mrunal Thakur) ఈ అంశంపై మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. టాలీవుడ్‌, బాలీవుడ్‌లలో వరుస అవకాశాలతో మృణాల్ ప్రస్తుతం బిజీగా ఉంది. ఆమె ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలోనే ఓ అవార్డు వేడుకలో ఎదురైన సంఘటనను గుర్తుచేసుకున్నారు.

‘సినీ ప్రముఖులకు జన్మించడం పిల్లల తప్పు కాదు. నెపోటిజం పేరుతో స్టార్‌లను ఎందుకు నిందిస్తుంటారో నాకు అర్థం కాదు. సాధారణ ప్రజలకు స్టార్స్‌ జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అందుకే మీడియా వారినే ఎక్కువ ఫోకస్‌ చేస్తుంది. కానీ, ఇది సరైన పద్ధతి కాదు. ఒక అవార్డు వేడుక కార్యక్రమంలో నేను మాట్లాడుతుండగా స్టార్‌ కిడ్‌తో కలిసి జాన్వీ కపూర్‌ అక్కడకు వచ్చారు. నా ఇంటర్వ్యూ తీసుకుంటున్న వాళ్లంతా కూడా పరిగెడుతూ ఆమె వద్దకే వెళ్లారు. ఒకవేళ జాన్వీకు అవార్డు వచ్చుంటే నాకు స్పీచ్‌ ఇచ్చే అవకాశం కూడా ఉండేది కాదు. అసూయతో ఈ మాటలు చెప్పడం లేదు. అది తన తప్పు కాదు’ అని చెప్పారు.

నిర్మాతలు అడిగితే ఇదే చెబుతా: పారితోషికం పెంపు వార్తలపై రష్మిక

సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మృణాల్‌ ఠాకూర్‌ ‘ఫ్యామిలీ స్టార్‌’లో నటిస్తోన్నారు. విజయ్‌ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. కుటుంబ వినోదంతో రూపొందుతున్న ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్‌ 5న  ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గీత గోవిందం’ తర్వాత విజయ్‌ - పరశురామ్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలే ఉన్నాయి. ‘ఐరనే వంచాలా ఏంటి’ డైలాగ్‌ సామాజిక మాధ్యమాలను ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని