Anant Ambani: అనంత్‌-రాధిక ప్రీవెడ్డింగ్ వేడుకలో మెరిసిన జాన్వీ కపూర్‌

అనంత్‌-రాధిక ప్రీవెడ్డింగ్ వేడుకల్లో బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ మెరిశారు. పాప్‌ సింగర్‌ రిహన్నాతో కలిసి స్టెప్పు లేశారు.

Updated : 02 Mar 2024 17:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ (Anant Ambani), ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సీఈఓ వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధిక (Radhika Merchant) ప్రీవెడ్డింగ్‌ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాప్‌ సింగర్‌ రిహన్నా (Rihanna) తన పాటలతో హుషారెత్తించారు. ఈ గ్లోబల్‌ సెన్సేషన్‌ తన బృందంతో కలిసి ఉర్రూతలూగించారు. ఆమెతో కలిసి బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ (janhvi kapoor) స్టెప్పులేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సిల్వర్‌ కలర్‌ వెస్ట్రన్‌ డ్రెస్‌లో మెరిసిన జాన్వీ.. ‘ధడక్‌’ సినిమాలోని పాటకు రిహన్నాతోపాటు డ్యాన్స్‌ చేశారు. వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోలను నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు. ఇటీవలే గ్రామీ అవార్డులను సొంతం చేసుకున్న రిహన్నా తనను ఈ వేడుకలకు ఆహ్వానించినందుకు అంబానీ కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. అక్కడి సిబ్బందితో ఫొటోలు దిగారు.

‘హనుమాన్‌’ క్లైమాక్స్‌కు మించి ‘జై హనుమాన్’ ఉంటుంది: ప్రశాంత్‌ వర్మ

అనంత్‌-రాధిక వివాహం జులైలో జరగనుంది. ప్రస్తుతం జామ్‌నగర్‌ వేదికగా ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా అంబానీ కుటుంబం ముందస్తు వివాహ వేడుకలు నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సినీ తారలు, పలువురు ప్రముఖులు జామ్‌నగర్‌ చేరుకుంటున్నారు. మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌, తన సతీమణి ప్రిసిల్లా చాన్‌తో కలిసి జామ్‌నగర్‌ వెళ్లారు. క్రికెటర్లు సచిన్‌, ధోనీ.. సినీ తారలు రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె, రాణీ ముఖర్జీ, షారుక్‌ఖాన్‌ కుటుంబం, అర్జున్‌ కపూర్‌, ఆలియాభట్‌-రణబీర్‌ కపూర్‌ కుటుంబం, దర్శకుడు అట్లీ తదితరులు చేరుకున్నారు. ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని