Janhvi kapoor: నాని ఎప్పటిలాగే అదరగొట్టేశారు: జాన్వీ ప్రశంస

నాని (Nani)పై జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) ప్రశంసలు కురిపించారు.

Updated : 10 Jan 2024 13:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నాని (Nani) హీరోగా తెరకెక్కిన ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) చిత్రంపై నటి జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘మృణాల్‌ ఠాకూర్‌ నటనకు ప్రేమలో పడిపోయా. తొలి ప్రయత్నంలోనే మనుసుని హత్తుకునే చిత్రాన్ని అందించినందుకు శౌర్యువ్‌కు కృతజ్ఞతలు. నాని.. ఎప్పటిలాగే అదరగొట్టేశారు’’ అని ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ పెట్టారు. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఆనందం వ్యక్తం చేసింది. ‘మీ ప్రశంసలు మాకెంతో విలువైనవి’ అని ట్వీట్‌ చేసింది.

2024లో ప్రేక్షకులు ఎదురుచూస్తోన్న చిత్రాలివే.. ‘పుష్ప2’ ఏస్థానంలో ఉందంటే!

‘దసరా’ తర్వాత నాని నటించిన చిత్రమిది. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. బేబీ కియారా, నాజర్‌, జయరాం కీలకపాత్రలు పోషించారు. డిసెంబర్‌ 7న విడుదలైన ఈ చిత్రం విజయాన్ని అందుకుంది. తండ్రిగా నాని నటనకు సినీ ప్రముఖులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ‘దేవర’తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు జాన్వీకపూర్‌. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని