IMDb: 2024లో ప్రేక్షకులు ఎదురుచూస్తోన్న చిత్రాలివే.. ‘పుష్ప2’ ఏస్థానంలో ఉందంటే!

ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (ఐఎమ్‌డీబీ) (IMDb)టాప్‌ 20 చిత్రాల జాబితాను తాజాగా విడుదల చేసింది. అందులో 5 తెలుగు సినిమాలు ఉన్నాయి.

Published : 09 Jan 2024 18:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (ఐఎమ్‌డీబీ) (IMDb) తాజాగా 2024లో ప్రేక్షకులు ఎదురుచూస్తోన్న ఇండియన్‌ సినిమాల జాబితాను విడుదల చేసింది. ప్రతి నెలా ఈ వెబ్‌సైట్‌ను చూసే 20కోట్ల మంది యూజర్ల రియల్‌ పేజ్‌ వ్యూస్‌ ఆధారంగా ఈ లిస్ట్‌ను తయారుచేస్తుంది. సోషల్‌ మీడియా వేదికగా ఈ టాప్‌ 20చిత్రాలను పంచుకుంది. టాలీవుడ్‌కు చెందిన 5 సినిమాలు ఉండడం విశేషం.

సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకొణె, అనిల్‌కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ‘ఫైటర్‌’(Fighter) మొదటి స్థానంలో ఉండగా.. అల్లు అర్జున్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ‘పుష్ప2’ (Pushpa2) రెండులో ఉంది. ‘కల్కి 2898 ఏడీ’(5), హనుమాన్‌ (7), దేవర(10), గుంటూరు కారం (12) స్థానాల్లో నిలిచాయి. సూర్య ‘కంగువ’ తొమ్మిదిలో ఉండగా.. కమల్‌హాసన్‌ ‘ఇండియన్‌2’ 17లో ఉంది. ఈ జాబితాలో ‘ఫైటర్‌’ అగ్రభాగాన ఉండడంపై హృతిక్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘సినిమా విడుదలకు మందు ఈ లిస్ట్‌ మాకు ఉత్సాహాన్నిచ్చింది. టీజర్‌, ట్రైలర్‌ ఎంతో ప్రేక్షకాదరణ పొందాయి. సినిమాను కూడా ఇదే స్థాయిలో ఆదరిస్తారని ఆశిస్తున్నాం. జనవరి 25న థియేటర్లో మీ అందరినీ చూడడం కోసం ఎదురుచూస్తున్నా’ అని పోస్ట్‌ పెట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని