Janhvi Kapoor: ట్రోల్‌ చేసేముందు వీడియో చూడండి: నెటిజన్‌కు స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చిన జాన్వీ

తన వీడియోపై ట్రోల్‌ చేసిన నెటిజన్‌కు జాన్వీ కపూర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ట్రోల్‌ చేసే ముందు వీడియోను పూర్తిగా చూడాలన్నారు.

Updated : 31 May 2024 13:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి జాన్వీ కపూర్‌ తాజాగా ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నారు. క్రికెట్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం ఆమె ఎంతో కష్టపడ్డారు. ఏకంగా 150 రోజులు శిక్షణ తీసుకున్నారు. ఆ సమయంలో ఎన్నో దెబ్బలు తగిలాయని తెలుపుతూ ఇటీవల ఆమె ఓ వీడియో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఓ నెటిజన్‌ ఆమెను ట్రోల్‌ చేస్తూ కామెంట్‌ పెట్టారు. అతడికి జాన్వీ (Janhvi Kapoor) స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

‘టెన్నిస్‌ బాల్‌తో క్రికెట్‌ ఆడితేనే మీకు ఇన్ని దెబ్బలు తగిలాయా?’ అని ట్రోల్‌ చేస్తూ ఓ నెటిజన్‌ నవ్వుతున్న ఎమోజీలను పెట్టారు. దీనికి జాన్వీ స్పందిస్తూ.. ‘ముందు క్రికెట్‌ బాల్‌తో ఆడితే గాయాలయ్యాయి. దీంతో టెన్నిస్‌ బాల్‌తో ఆడాల్సి వచ్చింది. నా భుజాలకు ఉన్న బ్యాండేజ్‌లను చూస్తే ఆ విషయం మీకు అర్థమవుతుంది. దెబ్బలు తగిలిన తర్వాత ఆడిన వీడియోనే ఇది. ట్రోల్‌ చేసే ముందు ఒకసారి వీడియో మొత్తం చూడండి. అప్పుడు నేను కూడా మీరు వేసే జోక్‌లకు నవ్వుతాను’ అని వ్యంగ్యంగా సమాధానమిచ్చారు.

150 రోజుల ట్రైనింగ్‌.. 30 రోజుల షూటింగ్‌.. రెండుసార్లు గాయాలు

ఈ సినిమా ప్రమోషన్స్‌లో జాన్వీ చాలా విషయాలను పంచుకున్నారు. తన రెమ్యునరేషన్‌ గురించి మాట్లాడుతూ.. నిర్మాత కుమార్తె కాబట్టి తనకు కొన్ని విషయాలపై అవగాహన ఉందన్నారు. నిర్మాతలపై భారం పడేలా ఏదీ చేయనని తెలిపారు. సినిమాకు ముందే అన్ని విషయాలను చర్చిస్తానన్నారు. ఆర్టిస్టులందరూ కేవలం డబ్బుల కోసమే పనిచేయరని.. కొందరు నటనపై ఇష్టంతో చేస్తారని తెలిపారు. ప్రస్తుతం జాన్వీ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ బిజీ అయ్యారు. ఎన్టీఆర్‌ సరసన ‘దేవర’లో నటిస్తున్నారు. రామ్‌ చరణ్‌కు జోడీగా ‘ఆర్సీ16’లో కనిపించనున్నారు. దీని షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు