Janhvi Kapoor: అమ్మ మరణం నన్ను బాధించలేదన్నారు: జాన్వీ కపూర్‌

అమ్మ మరణం నన్ను బాధించలేదని చాలా మంది నిందించారని జాన్వీ కపూర్‌ తెలిపారు. 

Updated : 23 May 2024 12:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమ్మ మరణించిన సమయంలో తనపై కొందరు ప్రతికూల కామెంట్స్ చేశారని జాన్వీ కపూర్‌ బాధపడ్డారు. ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పాల్గొన్నారు. అందులో తన తల్లి మరణించినప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. తన (Janhvi Kapoor) మొదటి సినిమా విడుదలకు కొన్ని నెలల ముందే శ్రీదేవి (Sridevi) మరణించారని అయినా ప్రమోషన్స్‌లో పాల్గొన్నట్లు తెలిపారు.

‘అమ్మ మరణించిన కొన్ని రోజులకే ‘ధడక్‌’ ప్రమోషన్స్‌కు హాజరయ్యాను. ఈ క్రమంలో ఓ డ్యాన్స్‌ రియాలిటీ కార్యక్రమానికి వెళ్లాను. వాళ్లు అమ్మకు సంబంధించిన పాటలు, వీడియోలతో నివాళులర్పిస్తూ డ్యాన్స్‌ చేశారు. అది చాలా బాగున్నప్పటికీ నేను చూడలేకపోయాను. గట్టిగా కేకలు వేసి ఏడ్చాను. అక్కడ ఉండలేక నా కార్‌లోకి వచ్చేశాను. దీంతో వారంతా ఆ కార్యక్రమాన్ని ఆపేశారు. అమ్మ మరణం నన్ను ప్రభావితం చేయలేదని చాలా మంది అనుకున్నారు. అది నిజం కాదు. ఆమె చనిపోయిన తర్వాత ఆ బాధ నుంచి బయటకు రావాలనే నేను పనిపై దృష్టిపెట్టాను. దాన్ని అర్థం చేసుకోకుండా కొందరు చేసిన వ్యాఖ్యలు నన్ను బాధించాయి. మా అమ్మ గురించి నేను ఏ ఇంటర్వ్యూలో ప్రస్తావించినా కొందరు నెగెటివ్‌ కామెంట్స్‌ చేసేవారు’ అని చెప్పారు.

నా గురించి అలా రాయడం చూసి బాధేసింది: లయ

ప్రస్తుతం జాన్వీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. శరణ్‌ శర్మ దర్శకత్వంలో ఆమె నటించిన ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ మే31న విడుదల కానుంది. దీనితో పాటు జాన్వీ టాలీవుడ్‌లోనూ రెండు సినిమాలతో అలరించనున్నారు. ఎన్టీఆర్‌ సరసన ‘దేవర’లో తంగం పాత్రలో కనిపించనున్నారు. బుచ్చిబాబు-రామ్‌చరణ్‌ల సినిమాలోనూ హీరోయిన్‌గా నటించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని