Janhvi kapoor: ఇదొక ఆధ్యాత్మిక అనుభూతి

‘‘దేవర’ చిత్రంలో పని చేస్తుంటే నా సొంత ఇంటికి వచ్చినట్లు అనిపిస్తోంది’’ అంటోంది నటి జాన్వీ కపూర్‌. శ్రీదేవి నట వారసురాలిగా ‘ధడక్‌’ సినిమాతో బాలీవుడ్‌ తెరకు పరిచయమైన ఈ అమ్మడు.

Updated : 04 Dec 2023 09:40 IST

‘‘దేవర’ చిత్రంలో పని చేస్తుంటే నా సొంత ఇంటికి వచ్చినట్లు అనిపిస్తోంది’’ అంటోంది నటి జాన్వీ కపూర్‌. శ్రీదేవి నట వారసురాలిగా ‘ధడక్‌’ సినిమాతో బాలీవుడ్‌ తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఇప్పుడు ‘దేవర’తో తెలుగు చిత్రసీమలోకి అడుగు పెట్టేందుకు సెట్స్‌పై ముస్తాబవుతోంది. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ మాస్‌ యాక్షన్‌ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. జాన్వీ ఇందులో తంగమ్‌ అనే పాత్రలో కనువిందు చేయనుంది. ఈ నేపథ్యంలో ఆమె ఈ చిత్ర అనుభవాల్ని అభిమానులతో పంచుకుంది. ‘‘దేవర’ కోసం సెట్లోకి అడుగు పెట్టినప్పుడల్లా నేను నా ఇంటికి వస్తున్నట్లు అనిపిస్తుంది. సెట్లోని ప్రతి ఒక్కరూ నా సొంత వాళ్లలా అనిపిస్తారు. ఇది అమ్మతో నాకున్న తీవ్రమైన భావోద్వేగ అనుబంధం వల్ల జరుగుతుందేమో నాకు తెలియదు. ఇలా దక్షిణాదిన సినిమా చేయడం ద్వారా అమ్మతో అటాచ్‌ అయినట్లు అనిపిస్తోంది. ఇదొక ఆధ్యాత్మిక అనుభూతి’’ అని చెప్పుకొచ్చింది జాన్వీ. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తొలి భాగం ‘దేవర పార్ట్‌ 1’ పేరుతో ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. సంగీతం: అనిరుధ్‌, ఛాయాగ్రహణం: రత్నవేలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని