Rc16: రామ్‌ చరణ్‌కు జోడీగా జాన్వీ.. అధికారికంగా ప్రకటించిన టీమ్‌

బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ తెలుగులో మరో స్టార్‌ హీరో సినిమాలో అవకాశాన్ని సొంతం చేసుకున్నారు.

Published : 06 Mar 2024 10:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్ : శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor). బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఇప్పటికే బీటౌన్‌లో బిజీ కాగా.. తెలుగులోనూ మరో అగ్ర హీరో సరసన కనిపించనున్నారు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్‌ (Ram charan) హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. RC16 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఇది ప్రచారంలో ఉంది. ఈ సినిమాలో జాన్వీ నటించనున్నట్లు తెలుపుతూ నిర్మాణ సంస్థ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన టీమ్‌.. ప్రాజెక్ట్‌లోకి స్వాగతం పలికింది. ఇది తెలుగులో జాన్వీకు రెండో సినిమా కానుంది.

అందుకే శర్వానంద్‌ ఆ హిట్‌ మూవీకి ‘నో’ చెప్పారు.. సెకండ్‌ ఛాన్స్‌లోనూ!

ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రానుంది. మైత్రి మూవీ మేకర్స్‌ సమర్పణలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్ మ్యూజిక్‌ అందిస్తున్నారు. మరోవైపు జాన్వీ ‘దేవర’తో బిజీగా ఉన్నారు. ఇందులో ఎన్టీఆర్‌ హీరోగా, సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుండగా.. తొలి భాగం ‘దేవర పార్ట్‌-1’ పేరుతో ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని