Janhvi Kapoor: ఆరుతో అదృష్టం కలిసిరావాలి

ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు చేయాలంటే ఆ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. అలాంటి ఎన్నో సవాళ్లను ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ కోసం ఎదుర్కొన్నానని అంటోంది బాలీవుడ్‌ యువకథానాయిక జాన్వీ కపూర్‌.

Published : 16 May 2024 01:03 IST

ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు చేయాలంటే ఆ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. అలాంటి ఎన్నో సవాళ్లను ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ కోసం ఎదుర్కొన్నానని అంటోంది బాలీవుడ్‌ యువకథానాయిక జాన్వీ కపూర్‌. ఆమె...రాజ్‌కుమార్‌ రావ్‌ జంటగా క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే ఇది. ఈ సినిమా కోసం రేయింబవళ్లు కష్టపడి క్రికెట్‌ నేర్చుకున్నానని తెలిపింది జాన్వీ. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ మాట్లాడుతూ...‘రెండేళ్ల పాటు క్రికెట్‌లో శిక్షణ తీసుకున్నా. దర్శకుడు శరణ్‌ శర్మ ఏ పనిలోనైనా నాణ్యతని కోరుకుంటారు. క్రికెట్‌ నేపథ్యంలో రూపొందించారు కాబట్టి నేను తప్పక క్రికెట్‌ నేర్చుకోవాలని పట్టుబట్టారాయన. ఎలాంటి వీఎఫ్‌ఎక్స్‌లు ఉపయోగించకూడదన్నారు. శిక్షణ సమయంలో ఎన్నో దెబ్బలు తగిలాయి. భుజాలు డిస్‌లొకేట్‌ అయ్యాయి. ఈ చిత్రాన్ని వదిలేద్దామని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నేను క్రికెట్‌ ఆడగలనని నాలో ధైర్యం నింపింది శిక్షకులు అభిషేక్‌ నాయర్‌, విక్రాంత్‌ సర్‌ మాత్రమే’ అని అంది. ప్రచారంలో ఆరు నంబరు కలిగిన దుస్తుల్ని మాత్రమే ఎందుకు ధరిస్తున్నారన్న ప్రశ్నకు..‘ఈ సినిమాలో నేను పోషించిన మహిమ క్రికెట్‌ ఆటలో ఆరు నంబరు గల జెర్సీనే ధరిస్తుంది. ఆమె ధోనికి వీరాభిమాని. మేము కూడా షూటింగ్‌ సమయంలో ధోని ధరించే ఏడు నంబరు జెర్సీనే ఉపయోగించాలనుకున్నాం. కానీ ఆ నంబరు ఆయనకు మాత్రమే సొంతం అనుకొని ఆరుని నిర్ణయించాం. అంతేకాదు ఆరు నా లక్కీ నంబరు కూడా. ఈ సినిమాకు కూడా ఆ అదృష్టం కలిసిరావాలని ఆశిస్తున్నా’ అంటూ సమాధానమిచ్చింది జాన్వీ. ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని