Janhvi Kapoor: శిఖర్‌ పహాడియాతో బంధంపై పెదవి విప్పిన జాన్వీ.. ఏమన్నారంటే!

మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌ కుమార్‌ షిండే మనవడు శిఖర్‌ పహాడియాతో తన బంధం గురించి జాన్వీ మొదటిసారి స్పందించారు.

Updated : 17 May 2024 19:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) మొదటిసారి శిఖర్‌ పహాడియా గురించి మాట్లాడారు. గత కొంతకాలంగా వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. తన తాజా చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ మొదటిసారి శిఖర్‌ గురించి మాట్లాడారు.

‘‘నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడే శిఖర్ నా జీవితంలోకి వచ్చాడు. మేమిద్దరం కలసి పెరిగాం. నా కలలను తనవిగా భావిస్తాడు. తన కలలు నావి అనుకుంటాను. మేము చాలా సన్నిహితంగా ఉంటాం. ఒకరినొకరం సపోర్ట్‌ చేసుకుంటాం’’ అని చెప్పారు. తాజాగా జాన్వీ తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెబుతూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘‘నా కలలు నిజమవ్వడానికి పూర్తి సపోర్ట్‌ ఇవ్వాలి. ధైర్యం చెప్పాలి. ఎప్పుడూ సంతోషంగా ఉంచాలి. నేను ఏడ్చినప్పుడు నా పక్కనే ఉండి అండగా నిలవాలి’’ అన్నారు.

దీంతో జాన్వీ.. శిఖర్ గురించే చెప్పారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక గతంలో బోనీ కపూర్‌ కూడా శిఖర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జాన్వీతో పరిచయం కాకముందు ముందునుంచే శిఖర్‌ తనకు తెలుసని బోనీ అన్నారు. మంచివాడని.. అందరితో త్వరగా కలిసిపోతారని చెప్పారు.

టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్‌ పోస్ట్‌.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?

సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం జాన్వీ..  ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. మే 31న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. శరణ్‌ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాజ్‌కుమార్‌ రావ్‌ హీరోగా నటిస్తున్నారు. దీనితో పాటు జాన్వీ టాలీవుడ్‌లోనూ రెండు సినిమాలతో అలరించనున్నారు. ఎన్టీఆర్‌ సరసన ‘దేవర’లో తంగంగా కనిపించనున్నారు. బుచ్చిబాబు - రామ్‌చరణ్‌ల సినిమాలోనూ హీరోయిన్‌గా నటించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని