Prabhas: టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్‌ పోస్ట్‌.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?

ప్రభాస్‌ పెట్టిన ఇన్‌స్టా పోస్ట్‌ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. అదేంటంటే..

Updated : 17 May 2024 11:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ స్టార్‌ హీరో ప్రభాస్ పెట్టిన ఇన్‌స్టా పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. చాలా అరుదుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయన ఓ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. దీంతో అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ‘డార్లింగ్స్‌.. ఎట్టకేలకు మన జీవితంలోకీ ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు. వెయిట్‌ చేయండి’ అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌లో చెప్పిన ప్రత్యేక వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దానికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను ఫ్యాన్స్ ఎక్స్‌లో షేర్‌ చేస్తున్నారు. ఆయన నటిస్తోన్న ‘కల్కి’ సినిమాలో కమల్‌ హాసన్‌ లుక్‌ రిలీజ్‌ చేయనున్నట్లు టాక్‌. ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసమే ఈ పోస్ట్‌ పెట్టినట్లు సమాచారం.

తనకు కమల్‌ హాసన్‌ అంటే ఎంత ఇష్టమో ప్రభాస్‌ ఇప్పటికీ చాలా సార్లు చెప్పారు. ఆయన ఈ సినిమాలో భాగమైనట్లు వెల్లడించినప్పుడు కూడా ఆనందంతో పోస్ట్‌ పెట్టారు.. ‘‘నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణం. కమల్‌ హాసన్‌ లాంటి లెజెండరీ నటుడితో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నా’’ అని అన్నారు. ఇప్పుడు కూడా ఆయన కోసమే ప్రభాస్‌ ఈ పోస్ట్‌ పెట్టినట్లు అర్థమవుతోంది. మరికొందరు మాత్రం ఆయన పెళ్లి గురించి పెట్టారని చర్చించుకుంటున్నారు.

ఆ రూమర్స్‌కు చెక్‌ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ

ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లరే ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898 AD). ఇందులో కమల్‌హాసన్‌ (Kamal Haasan) ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్‌కు జోడీగా దీపిక పదుకొణె నటిస్తుండగా పశుపతి, దిశాపటానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ మూవీ జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని