Janhvi Kapoor: సీతగా జాన్వీ కపూర్.. వైరలవుతోన్న న్యూస్‌

అల్లు అరవింద్‌ (Allu Aravind) నిర్మాతగా నితేశ్‌ తివారీ దర్శకత్వంలో రామాయణం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఓ రూమర్‌ వైరల్‌ అవుతోంది.

Published : 07 Feb 2024 17:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ అగ్ర దర్శకుడు నితేశ్‌ తివారీ భారీ తారాగణంతో రామాయణాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా దీనిపై ఎన్నో వార్తలు సోషల్‌ మీడియాలో ప్రచారమవుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన వార్త ఒకటి తెగ షేర్‌ అవుతోంది. ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) ఖాయమయ్యారని గతంలోనే వార్తలు వచ్చాయి. సీతగా పాత్రలో ఎవరు కనిపిస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. 

సీత పాత్ర కోసం మొదట అలియాభట్‌కు లుక్‌ టెస్ట్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. తర్వాత సాయి పల్లవిని ఎంపిక చేశారని టాక్ వినిపించింది. ఇప్పుడు తెరపైకి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) పేరు వచ్చింది. నితేశ్‌ తివారీ ఆఫీస్ వద్ద తాజాగా జాన్వీ కనిపించడంతో ఈ ప్రచారం జోరందుకుంది. లుక్‌ టెస్ట్‌ కోసమే ఆమె అక్కడికి వెళ్లినట్లు చెబుతున్నారు. నితేశ్‌ దర్శకత్వంలో జాన్వీ ‘బవాల్‌’లో నటించారు. అందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో మరోసారి ఆమెకు అవకాశమివ్వాలని నితేశ్‌ భావిస్తున్నారని, ఈ సినిమాలో రావణుడిగా యశ్‌ (Yash), విభీషణుడిగా విజయ్‌ సేతుపతి, హనుమంతుడిగా బాబీ దేవోల్‌ కనిపించనున్నట్లు తెలుస్తోంది.

రాజమౌళిపై మరోసారి ప్రశంసలు కురిపించిన జేమ్స్‌ కామెరూన్‌

దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించనున్నారు. మూడు భాగాల్లో దీన్ని తీసుకురావాలని మేకర్స్‌ భావిస్తున్నారు. దీని వీఎఫ్ఎక్స్‌ ఎఫెక్ట్‌ల కోసం నితేశ్‌ తివారీ టీమ్‌ ఆస్కార్‌ విన్నింగ్‌ కంపెనీ డీఎన్‌ఈజీ (DNEG)తో సంప్రదింపులు జరిపిందట. ఈ చిత్రం కోసం అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని వినియోగించాలని చిత్రబృందం యోచిస్తోందని అందుకే లుక్‌ టెస్ట్‌ కోసం కూడా త్రీడీ టెక్నాలజీని ఉపయోగించారని టాక్‌ వినిపిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను అల్లు అరవింద్ మరికొంతమంది బాలీవుడ్‌ నిర్మాతలతో కలిసి నిర్మిస్తున్నారు.

రామ్ చరణ్ సినిమాలోనూ జాన్వీ..

రామ్ చరణ్‌- బుచ్చిబాబు కాంబోలో రానున్న సినిమాలోనూ జాన్వీ కపూర్‌ ఓకే అయినట్లు తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్‌ ఆమెకు వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సైన్ చేసినట్లు సమాచారం.   ఇదే నిజమైతే తెలుగులో జాన్వీ చేసే సెకండ్ ప్రాజెక్ట్ ఇదే అవుతుంది. ప్రస్తుతం దీని ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని