Jawan: 50 రోజులు పూర్తి చేసుకున్న ‘జవాన్‌’.. వసూళ్లు ఎంతంటే?

షారుక్‌ ఖాన్ హీరోగా అట్లీ రూపొందించిన చిత్రం ‘జవాన్’ (Jawan). ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చి 50రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అట్లీ స్పెషల్‌ పోస్ట్‌ పెట్టారు.

Published : 27 Oct 2023 15:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ‘పఠాన్‌’ (Pathaan)తో పవర్‌ఫుల్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చారు బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan). ఆ సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచి రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. దాని తర్వాత ‘జవాన్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ రికార్డులను బ్రేక్‌ చేస్తోంది. తాజాగా దీనిపై దర్శకుడు అట్లీ పోస్ట్‌ చేశారు.

భారీ అంచనాల మధ్య సెప్టెంబర్‌ 7న ‘జవాన్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అట్లీ-షారుక్‌ల కాంబినేషన్‌కు ప్రేక్షకులు ఫిదా అవ్వడంతో సినిమా సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం విడుదలై 50రోజులు పూర్తి కావడంతో దర్శకుడు అట్లీ స్పెషల్‌ పోస్ట్‌ చేశారు. ‘‘జవాన్’ (Jawan)తో మీ ముందుకు వచ్చి 50 రోజులవుతోంది. ఇప్పటికీ ఈ చిత్రం కొన్ని లక్షల మంది హృదయాలను గెలుచుకుంటోంది. ప్రపంచమంతా దీని హవా కనిపిస్తూనే ఉంది’ అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. తొలిరోజే రూ.100కోట్లు వసూళ్లు చేసిన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.1,145 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. 50వ రోజు కూడా సుమారు రూ.11లక్షలు వసూళ్లు చేసింది. దీంతో ఆయన అభిమానులు సంబరపడుతున్నారు. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా.. విలన్‌గా విజయ్‌ సేతుపతి ఆకట్టుకున్నారు. ఇతర పాత్రల్లో ప్రియమణి, సాన్యా మల్హోత్ర, దీపికా పదుకొణె తదితరులు అలరించారు.

‘ఐరనే వంచాలా ఏంటి’ ఈ మీమ్స్‌ చూస్తే నవ్వకుండా ఉండలేరు!

ప్రస్తుతం రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో షారుక్‌ ‘డంకీ’ (Dunki) చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. డిసెంబరు 21న దీన్ని విడుదల చేయనున్నారు. దీని టీజర్‌ను షారుక్‌ పుట్టినరోజు సందర్భంగా నవంబర్‌2న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో తాప్సీ, దియా మీర్జా, బొమన్‌ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గౌరీఖాన్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ, జ్యోతి దేశ్ పాండేలు నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని