Jawan: హాలీవుడ్ అవార్డుల బరిలో ‘జవాన్‌’.. భారత్‌ నుంచి ఏకైక చిత్రమిదే..

షారుక్‌-అట్లీల కాంబోలో వచ్చిన ‘జవాన్’(Jawan) హాలీవుడ్‌ అవార్డుల బరిలో నిలిచింది. దీంతో సోషల్ మీడియాలో చిత్రబృందానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 08 Dec 2023 19:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల్లో ‘జవాన్‌’ ఒకటి. అట్లీ దర్శకత్వంలో షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)నటించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు ‘జవాన్’ హాలీవుడ్‌ చిత్రాలతో పోటీ పడడానికి సిద్ధమైంది. ప్రతి సంవత్సరం ‘హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌’ (Hollywood Critics Association) అవార్డుల పండగ జరగనున్న విషయం తెలిసిందే. తాజాగా దీని పేరును ‘అస్త్ర’ అవార్డులుగా మార్చారు.

2024కుగానూ ‘అస్త్ర’అవార్డుల (ASTRA Awards) కోసం నామినేట్‌ అయిన చిత్రాల జాబితాను సంస్థ ప్రకటించింది. ఇందులో షారుక్‌ నటించిన ‘జవాన్‌’ చోటు దక్కించుకుంది. భారత్‌ నుంచి నామినేట్‌ అయిన ఏకైక చిత్రంగా నిలిచింది. ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ‘జవాన్‌’ వివిధ దేశాలకు చెందిన 10 చిత్రాలతో పోటీపడనుంది. గతేడాది ఈ అవార్డుల్లో ‘ఆర్ఆర్‌ఆర్’ సత్తా చాటిన విషయం తెలిసిందే. ఏకంగా ఐదు విభాగాల్లో అవార్డులను ఆ చిత్రం సొంతం చేసుకుంది. ఇక ఈ ఏడాది భారత్‌ నుంచి ‘జవాన్‌’ ఈ అవార్డుల బరిలో నిలవడంతో సోషల్‌ మీడియా వేదికగా చిత్రబృందానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘జవాన్‌’ (Jawan) కచ్చితంగా అవార్డును సొంతం చేసుకుంటుందంటూ షారుక్‌ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న లాస్‌ ఏంజిల్స్‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవ వేడుక జరగనుంది.

రివ్యూ: ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌.. కామెడీ ఎంటర్‌టైనర్‌తో నితిన్‌ హిట్‌ అందుకున్నారా..?

ఇక తాజాగా ‘జవాన్‌’ ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (ఐఎమ్‌డీబీ) విడుదల చేసిన మోస్ట్‌ పాపులర్‌ చిత్రాల జాబితాలోనూ మొదటి స్థానంలో నిలిచింది. దీనిపై అట్లీ స్పందిస్తూ.. ‘జవాన్‌’ కొన్ని కోట్ల మంది హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఈ చిత్రంపై చూపిన ప్రేమను మర్చిపోలేనంటూ కృతజ్ఞతలు తెలిపారు. షారుక్‌ ఖాన్‌ - నయనతార (Nayanthara) ప్రధానపాత్రల్లో నటించిన ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి విలన్‌గా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని