పేరు అదేనా?

ఎన్టీఆర్‌ - ప్రశాంత్‌ నీల్‌ కలయికలో రూపొందనున్న సినిమాపై ఈ నెల 20న మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ పుట్టినరోజైన ఆ రోజున  చిత్రబృందం అధికారికంగా సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాల్ని కానీ... పేరుని కానీ వెల్లడించే అవకాశాలున్నాయి.

Updated : 18 May 2024 00:37 IST

న్టీఆర్‌ - ప్రశాంత్‌ నీల్‌ కలయికలో రూపొందనున్న సినిమాపై ఈ నెల 20న మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ పుట్టినరోజైన ఆ రోజున  చిత్రబృందం అధికారికంగా సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాల్ని కానీ... పేరుని కానీ వెల్లడించే అవకాశాలున్నాయి. అయితే ఇంతలోనే సామాజిక మాధ్యమాల్లో ఓ పేరు జోరుగా ప్రచారం సాగుతోంది. అత్యంత ఆసక్తికరమైన...  భారీ అంచనాలున్న ఈ సినిమాకి ‘డ్రాగన్‌’ అనే పేరు పరిశీలనలో ఉందన్నదే ఆ ప్రచారం. మరి అదే పేరేనా లేక, మరొకటి ఏదైనా ఖరారు చేస్తారా అనేది చూడాలి. ఈ సినిమా ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘దేవర’, ‘వార్‌2’ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘దేవర’ తొలి భాగం చిత్రీకరణ పూర్తవ్వగానే ప్రశాంత్‌ నీల్‌ సినిమాపై దృష్టి పెట్టనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని