Kajal Aggarwal: అతడి ప్రవర్తనకు భయపడ్డా: కాజల్‌ అగర్వాల్‌

తన కెరీర్‌లో ఎదురైన ఓ చేదు అనుభవం గురించి చెప్పారు కాజల్‌ అగర్వాల్‌. ఏమైందంటే? 

Published : 21 May 2024 17:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫేవరెట్‌ సినీ తారలు కళ్ల ముందు కనపడగానే కొందరు తమ అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో.. అప్పుడప్పుడు హద్దులు దాటుతుంటారు. అలాంటి వారి ప్రవర్తన ఆయా యాక్టర్లకు ఇబ్బంది కలిగిస్తుంటుంది. ప్రముఖ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌కూ (Kajal Aggarwal) ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందట. ‘సత్యభామ’ (Satyabhama) ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. గతంలో తాను నటించిన ఓ సినిమా చిత్రీకరణలో ఎదురైన సంఘటనను గుర్తుచేసుకున్నారు.

టాలీవుడ్‌ హీరోలపై కాజల్‌ ఆసక్తికర కామెంట్స్‌.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే

‘‘కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ సినిమా షూటింగ్‌లో నేను పాల్గొన్నా. తొలి రోజు చిత్రీకరణ పూర్తయ్యాక ఆ మూవీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అనుమతి లేకుండా నా వ్యానిటీ వ్యాన్‌లోకి వచ్చాడు. చొక్కా విప్పి.. తన ఛాతీపై ఉన్న నా పేరుతో కూడిన టాటూని చూపించాడు. ఎవరూ లేని సమయంలో అతడలా చేయడంతో నేను భయపడ్డా. నాపై అభిమానాన్ని పచ్చబొట్టు రూపంలో ప్రదర్శించినందుకు ఆనందమే. కానీ, ఇలా చేయడమే కరెక్ట్‌ కాదని సున్నితంగా హెచ్చరించా’’ అని అన్నారు. సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహించిన ‘సత్యభామ’లో కాజల్‌ పోలీసు ఆఫీసర్‌గా నటించారు. నవీన్‌ చంద్ర కీలక పాత్రధారి. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈనెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని