Kajal: టాలీవుడ్‌ హీరోలపై కాజల్‌ ఆసక్తికర కామెంట్స్‌.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal) తన ఇష్టాయిష్టాలను పంచుకున్నారు. 

Published : 21 May 2024 00:05 IST

‘సత్యభామ’తో మొదటిసారి పోలీస్‌గా ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌. సుమన్‌ చిక్కాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో కాజల్ వరుస ప్రమోషన్స్‌తో జోరు పెంచారు. ఇందులోభాగంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన (Kajal Aggarwal) ఇష్టాయిష్టాలను పంచుకున్నారు. 

మీరు ఇప్పటివరకు చేసిన చిత్రాల్లో ఏదంటే ఇష్టం

కాజల్‌: ‘సత్యభామ’. నటీనటులు ఎవరైనా ప్రస్తుతం వాళ్లు చేస్తోన్న సినిమాను అమితంగా ఇష్టపడాలి. అందుకే నాకు ‘సత్యభామ’ అంటే ఇష్టం.

మీకు ఏ జానర్‌ చిత్రాలంటే ఇష్టం?

కాజల్‌: కామెడీ, రొమాన్స్‌ సినిమాలను ఇష్టపడతాను. ‘బాద్‌ షా’లో నా పాత్ర చాలా ఇష్టం. నేను ఇప్పటివరకు చేసిన సినిమాలోని పాత్రల పేర్లన్నీ గుర్తే.

మీరు, మీ అబ్బాయి ఒకే తేదీన పుట్టారు కదా ఎలా అనిపిస్తుంది?

కాజల్‌: మేమిద్దరం 19 తేదీన పుట్టాం. నేను జూన్‌ 19, మా అబ్బాయి ఏప్రిల్‌ 19. అది యాదృచ్ఛికంగా జరిగిందంతే. ప్లాన్‌ చేసుకోలేదు.

మీకు ఇష్టమైన డ్రెస్‌?

కాజల్‌: చీర కట్టుకోవడం ఇష్టపడతాను. మామిడి పండ్లంటే ఇష్టం. ఇప్పుడు సీజన్‌ కదా. ప్రతిరోజూ తింటున్నాను. ఒక్కోరోజు మూడు పండ్లు కూడా తినేస్తున్నా.

సోషల్‌ మీడియా ఎక్కువ వాడతారా?

కాజల్‌: చాలా తక్కువ వాడతాను. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటేనే పోస్ట్‌ చేస్తా.

లాంగ్‌ డ్రైవ్స్‌ ఇష్టపడతారా?

కాజల్‌: నో. నాకు ప్రయాణం చేయడం నచ్చదు. దానికోసం సమయం వృథా చేసుకోను. అందుకే విమానంలోనే ప్రయాణించడానికే ప్రాధాన్యమిస్తా.

టాలీవుడ్‌లో మీకు ఇష్టమైన నటీనటులు ఎవరు?

కాజల్‌: నాకు అందరూ ఇష్టమే. వాళ్లలో ఒక్కరు అని చెప్పలేను. 

టాలీవుడ్‌ హీరోలపై మీ అభిప్రాయం చెప్పండి?

కాజల్‌: ప్రభాస్‌- సినిమాలను ఎంపిక చేసుకునే విధానం చాలా బాగుంటుంది. పాన్‌ ఇండియా, గ్లోబల్‌ స్క్రిప్ట్‌లను ఎంచుకుంటాడు. మన సినిమాలకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చాడు.
ఎన్టీఆర్‌- చాలా టాలెంటెడ్‌.
రామ్‌ చరణ్‌- ఆల్‌ రౌండర్‌. ప్రతి సినిమాకు ఎదుగుతున్నాడు.
మహేశ్‌బాబు- చార్మింగ్‌ పర్సన్‌.
అల్లు అర్జున్‌ - ప్రతి సన్నివేశంలో అద్భుతంగా నటిస్తాడు. ‘పుష్ప2’ కోసం ఎదురుచూస్తున్నా.
పవన్‌ కల్యాణ్‌- ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. 
చిరంజీవి- కంప్లీట్‌ ప్యాకేజ్‌. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. 
బాలకృష్ణ- చాలా ఫన్నీగా ఉంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు