Kajal Aggarwal: నా విషయంలో అలా జరగలేదు: కాజల్‌ అగర్వాల్‌

ప్రముఖ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ నటించిన తాజా చిత్రం ‘సత్యభామ’. ఈ సినిమా ప్రమోషన్స్‌తో ప్రస్తుతం ఆమె బిజీగా ఉన్నారు.

Published : 02 Jun 2024 00:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘సత్యభామ’ (Satyabhama)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు ప్రముఖ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ (Kajal Aggarwal). ఈమె ప్రధాన పాత్రలో దర్శకుడు సుమన్‌ చిక్కాల తెరకెక్కించిన చిత్రమిది. జూన్‌ 7న విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా కాజల్‌ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తన సినిమా కబుర్లతోపాటు ఇతర అంశాల గురించీ మాట్లాడుతున్నారు. తాజా ఇంటర్వ్యూలో.. ‘తెలుగు మాట్లాడగలిగే నటులకే (ఇతర చిత్ర పరిశ్రమవారు) ఇక్కడి ప్రేక్షకులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అప్పట్లో ఇలా ఉండేది కాదు కదా’ అని ప్రస్తావించగా కాజల్‌ స్పందించారు. తన విషయంలో అలా ఎప్పుడూ జరగలేదని అన్నారు. ఫ్యాన్స్‌, ఆడియన్స్‌ ఎంతో సపోర్ట్‌గా ఉన్నారని చెప్పుకొచ్చారు. నటనకు భాష అవసరంలేదని, అయినా నేర్చుకునేందుకు తన వంతు ప్రయత్నం చేశానని, ఇంకా చేస్తూనే ఉన్నానని పేర్కొన్నారు.

హీరోయిన్ల విషయంలో ‘ఐరన్‌లెగ్‌’ అనే కామెంట్స్‌ రావడంపై మాట్లాడుతూ.. ‘‘ఆ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. హీరోయిన్‌ సినిమాలో ఓ భాగం మాత్రమే. ఏ చిత్రమైనా ఫ్లాప్‌ అయితే హీరోయిన్‌పైనే నెగెటివ్‌గా మాట్లాడడం సరికాదు’’ అని అన్నారు. అవకాశం వస్తే నయనతార, అనుష్క శెట్టిలతో కలిసి నటించాలనుంది ఈ సందర్భంగా తన మనసులో మాటను బయటపెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని