Kannappa: ‘కన్నప్ప’లో స్టార్‌ హీరోయిన్‌.. అధికారికంగా ప్రకటించిన టీమ్

మంచు విష్ణు ‘కన్నప్ప’లో మరో స్టార్ హీరోయిన్‌ భాగమయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ టీమ్‌ పోస్ట్‌ పెట్టింది.

Published : 17 May 2024 17:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్: మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్‌కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో ఇప్పటికే వివిధ భాషలకు చెందిన అగ్రనటులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పుడీ ప్రాజెక్ట్‌లో మరో స్టార్‌ హీరోయిన్‌ భాగమయ్యారు. ఈవిషయాన్ని తెలుపుతూ టీమ్‌ అధికారిక ప్రకటన చేసింది. ‘మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో టాలెంటెడ్‌ హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన సినిమాటిక్‌ అనుభూతిని పొందడానికి సిద్ధంగా ఉండండి’ అని పేర్కొంది.

టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్‌ పోస్ట్‌.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?

ఇప్పటికే ఈ సినిమాలో అగ్ర కథానాయకులు మోహన్‌ బాబు, మోహన్‌ లాల్‌, శివరాజ్‌కుమార్‌, శరత్‌ కుమార్‌తో పాటు బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. అక్షయ్‌కుమార్‌ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ కూడా ఇటీవలే పూర్తయింది. విష్ణు టైటిల్‌ రోల్‌ పోషిస్తుండగా.. ప్రభాస్‌, నయనతారలు కీలక పాత్రల్లో నటించనున్నారు. తాజాగా ప్రభాస్‌ (Prabhas) ఈ షూటింగ్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో భరతనాట్యంలో నిష్ణాతురాలైన ప్రీతి కథానాయికగా కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు