Sathyabhama: కాజల్‌ ‘సత్యభామ’ వాయిదా.. కొత్త విడుదల తేదీ ఇదే

కాజల్‌ పోలీస్‌గా నటించిన ‘సత్యభామ’ వాయిదా పడింది. మే 31 నుంచి వైదొలగింది.

Published : 23 May 2024 16:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాజల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సత్యభామ’ (Sathyabhama Movie). సుమన్‌ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మరోసారి వాయిదా పడింది. మొదట ఈ సినిమాను మే 17న విడుదల చేయాలని భావించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తికాకపోవడంతో మే 31కు వాయిదా వేశారు. తాజాగా ఈ తేదీన కూడా రావడం లేదని కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు.

జాన్‌ 7న దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ విషయాన్ని తెలుపుతూ కాజల్‌ (Kajal Aggarwal) పోస్ట్‌ పెట్టారు. ‘ప్రతీ పాత్ర ఓ ప్రయాణమే. కానీ, ‘సత్యభామ’ మాత్రం ఓ విప్లవం. ఎవరికైనా న్యాయం చేయడం డ్యూటీ మాత్రమే కాదు.. అది వాళ్లకు మనం చేసే ప్రామిస్‌. జూన్‌ 7న ‘సత్యభామ’తో ప్రయాణం చేయడానికి మీరంతా సిద్ధమేనా’ అని పేర్కొన్నారు. ఇందులో కాజల్‌ (Kajal) శక్తివంతమైన పోలీసు అధికారిగా నటించారు. ‘మేజర్‌’ చిత్ర దర్శకుడు శశికిరణ్‌ తిక్క సమర్పకులుగా వ్యవహరించడంతోపాటు, స్క్రీన్‌ప్లే సమకూర్చారు. ప్రకాశ్‌రాజ్‌, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రల్ని పోషించారు.

అమ్మ మరణం నన్ను బాధించలేదన్నారు: జాన్వీ కపూర్‌

ఇక మే31 నుంచి మరో సినిమా కూడా వైదొలిగిన సంగతి తెలిసిందే. సుధీర్‌బాబు (Sudheer Babu) హీరోగా జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించిన ‘హరోం హర’ (Harom Hara) ఇటీవలే వాయిదా పడింది. మే 31 నుంచి జూన్‌ 14కు పోస్ట్‌పోన్‌ అయింది.  1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే చిత్రమిది. యాక్షన్‌కు ఎంతో ప్రాధాన్యముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని