Kalki 2898 AD: కల్కి ఆ ఇంగ్లీష్‌ మూవీకి కాపీనా? నాగ్‌ అశ్విన్‌ రిప్లై ఇదే!

ప్రభాస్‌ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్‌ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్పందించారు.

Published : 30 Apr 2024 00:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుల సినిమాలు సెట్స్‌పై ఉండగా అనేక ఊహాగానాలు, వార్తలు సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఆ మూవీకి సంబంధించిన పోస్టర్‌, టీజర్‌ విడుదల చేస్తే, వేరే భాషల్లో విడుదలైన చిత్రాలను పోలుస్తూ పోస్టులు పెడుతుంటారు. ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘కల్కి 2898 ఏడీ’కి (Kalki 2898 AD) కూడా ఇదే సమస్య ఎదురైంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు చూసి, హాలీవుడ్‌ మూవీ ‘డ్యూన్‌’ను కాపీ కొట్టారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ అడిగితే ఒక్కసారిగా నవ్వేసి అదిరిపోయే రిప్లై ఇచ్చారు.

ఇటీవల నిర్వహించిన మూవీ గోయెర్స్‌ ఈవెంట్‌లో నాగ్‌అశ్విన్‌ పాల్గొనగా, ‘కల్కిని హాలీవుడ్‌ చిత్రం డ్యూన్‌తో పోలుస్తున్నారు కదా. మీ అభిప్రాయం ఏంటి’ అని అడగ్గా, ‘అవునా... బహుశా మీరు సినిమాలో ఉన్న ఇసుకను చూసి అలా భావించి ఉండవచ్చు. మీరు ఇసుక ఎక్కడ చూసినా డ్యూన్‌ మూవీలానే కనిపిస్తుంది’ అని సమాధానం ఇచ్చారు. ‘కల్కి’ని ఇలా వేరే హాలీవుడ్‌ చిత్రాలతో పోల్చడం ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ పలు సినిమాల రిఫరెన్స్‌లు ఉన్నాయంటూ రాసుకొచ్చారు. ఏదేమైనా ఇప్పటివరకూ తెలుగు తెరపై చూడని సరికొత్త ప్రపంచాన్ని నాగ్‌ అశ్విన్‌ ఆవిష్కరించబోతున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రంలో అమితాబ్‌ పోషిస్తున్న ‘అశ్వత్థామ’ పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్‌ మూవీపై ఆసక్తిని మరింత పెంచింది. కమల్‌హాసన్‌, దీపిక పదుకొణె, దిశా పటానీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని