Kalki: ఈటీవీ విన్‌లో టొవినో ‘కల్కి’

‘ఈ నంచెన్‌ కోటలో ఎవరి కన్నీళ్లు తుడవటానికి నేను రాలేదు. కానీ కన్నీళ్లు పెట్టించే వారి తలలు మాత్రం పగిలిపోవాలి’ అంటున్నారు మలయాళ కథానాయకుడు టొవినో థామస్‌.

Published : 07 Jun 2024 00:50 IST

నంచెన్‌ కోటలో ఎవరి కన్నీళ్లు తుడవటానికి నేను రాలేదు. కానీ కన్నీళ్లు పెట్టించే వారి తలలు మాత్రం పగిలిపోవాలి’ అంటున్నారు మలయాళ కథానాయకుడు టొవినో థామస్‌. ఇదంతా ‘కల్కి’ చిత్రం కోసమే. టొవినో టైటిల్‌ పాత్రలో పోలీసు అధికారిగా నటించారు. సంయుక్తా మేనన్‌ కథానాయిక. ప్రవీణ్‌ ప్రభారమ్‌ దర్శకుడు. సువిన్‌ కె.వర్కీ, ప్రశోభ్‌ కృష్ణ నిర్మించారు. మలయాళంలో విడుదలై మంచి ప్రశంసల్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ సీనియర్‌ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ఆత్మహత్య తర్వాత..నంచెన్‌కోటలో ధైర్యవంతుడైన ఒక పోలీసు అధికారి బాధ్యతలు స్వీకరిస్తాడు. శాంతిభద్రతలకు, ప్రజల క్షేమానికి విఘాతం కలిగించే క్రూరమైన రాజకీయ నాయకులను ఎలా ఎదుర్కొన్నాడనే కథనంతో ఈ చిత్రం రూపొందింది. మరి ‘కల్కి’ యాక్షన్‌ ఎలా ఉందో తెలియాలంటే ఈటీవీ విన్‌ అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని చూడండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని