kalki: కాశీ వీధుల్లో భైరవ

మహాభారత పురాణంలోని సంఘటనలు మొదలుకొని...భవిష్యత్తులో రానున్న 2898 సంవత్సరం వరకూ జరిగే కథతో ‘కల్కి 2898 ఏడీ’ తెరకెక్కుతోంది. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు.

Updated : 09 Mar 2024 10:26 IST

మహాభారత పురాణంలోని సంఘటనలు మొదలుకొని...భవిష్యత్తులో రానున్న 2898 సంవత్సరం వరకూ జరిగే కథతో ‘కల్కి 2898 ఏడీ’ తెరకెక్కుతోంది. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. ఇందులో భైరవ పాత్రలో ప్రభాస్‌ సందడి చేయనున్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఇందులో ఆయన లుక్‌ని విడుదల చేశారు. భవిష్యత్తు కాశీ నగరం వీధుల్లో ఉన్న భైరవగా ప్రభాస్‌ని పరిచయం చేసింది చిత్రబృందం. ఆధునిక అవతారంలో ప్రభాస్‌ కనిపించారు. సైన్స్‌ ఫిక్షన్‌ కథతో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని