Devara: ‘దేవర’.. అలాంటి సీక్వెన్స్ ఎవరూ చేసి ఉండరు: ఎన్టీఆర్‌ చిత్రంపై కల్యాణ్‌రామ్‌ కామెంట్స్‌

‘దేవర’ (Devara) చిత్రాన్ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిత్ర నిర్మాత కల్యాణ్‌రామ్‌ (kalyan Ram).

Published : 27 Dec 2023 20:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్టీఆర్‌ (NTR) హీరోగా కొరటాల శివ (Koratala Siva) తెరకెక్కిస్తోన్న చిత్రం ‘దేవర’ ( Devara). ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ దీనిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ‘దేవర’ చిత్రాన్ని ఉద్దేశించి కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా భారీ స్థాయిలో ఉండనుందని చెప్పారు.

‘‘దేవర’ కోసం టీమ్‌ మొత్తం ఎంతో కష్టపడి వర్క్‌ చేస్తున్నాం. చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని రీసెర్చ్‌ చేసి చేస్తున్నాం. ఇందులో చూపించిన కొన్ని వస్తువులను వేరే చిత్రాల్లో చూసే అవకాశం లేదు. ఇటీవల అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ తెరకెక్కించాం. భారతీయ చిత్రాల్లో ఇప్పటివరకూ అలాంటి సీక్వెన్స్‌ ఎవరూ చేసి ఉండరు. ఈ సీక్వెన్స్‌ కోసం దాదాపు ఎనిమిది నెలలు రీసెర్చ్‌ చేశారు. ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ అనేది హాలీవుడ్‌ మూవీ. నా వరకూ మా సినిమా ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ కంటే ఎక్కువ. ఈ చిత్రాన్ని వేరే చిత్రాలతో పోల్చి చూడటం నాకు ఇష్టం లేదు’’ అని ఆయన చెప్పారు.

Social Look: ఆమిర్‌ఖాన్‌ ఇంట మొదలైన పెళ్లి వేడుకలు.. రెడ్‌ డ్రెస్‌లో జాన్వీ మెరుపులు..!

తన గత చిత్రం పరాజయంపై మాట్లాడుతూ.. ‘‘అమిగోస్‌’ సరిగ్గా ఆడకపోవడంతో నిరాశకు గురయ్యా. ఆ చిత్ర దర్శకుడు రాజేంద్ర అంటే నాకెంతో ఇష్టం. అవకాశం వస్తే భవిష్యత్తులో అతనితో మరో సినిమా చేస్తా. ‘బింబిసార’ తర్వాత వచ్చిన చిత్రం కావడంతో ‘అమిగోస్‌’పై ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు. కమర్షియల్‌ అంశాలు లేకుండా కేవలం కథ మీదే ఫోకస్‌ పెట్టాం. కాన్సెప్ట్‌ అందరికీ నచ్చింది కానీ.. దాన్ని తీర్చిదిద్దడంలో హైప్‌ క్రియేట్‌ చేయలేకపోయాం. ఆ విషయాన్ని ముందు గుర్తించలేకపోయాం. అదే తప్పిదం’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని